BigTV English

Kingdom: వాయిదాపడ్డ కింగ్ డం.. ఆలస్యానికి కారణం అతడేనా..?

Kingdom: వాయిదాపడ్డ కింగ్ డం.. ఆలస్యానికి కారణం అతడేనా..?

Kingdom: రౌడీ హీరో విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాలో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ఆ తర్వాత పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మారారు. మొదటి సినిమాతోనే హీరోగా నిలదొక్కుకున్న విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయారు. ఈ చిత్రానికి సందీప్ రెడ్డివంగా దర్శకత్వం వహించగా, బాలీవుడ్ బ్యూటీ షాలిని పాండే హీరోయిన్గా నటించారు. ఇక ఈ సినిమా తర్వాత ద్వారక, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, గీతాగోవిందం అంటూ పలు చిత్రాలు చేశారు విజయ్ దేవరకొండ.


వాయిదా పడ్డ కింగ్డమ్..

ఇక చివరిగా ఖుషి, ది ఫ్యామిలీ స్టార్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఈ సినిమాలతో పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. ఇక ఇప్పుడు జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్డమ్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మరో నెలలో విడుదల కాబోతోంది అంటూ వార్తలు వినిపించినా.. ఇప్పుడు ఈ సినిమా ఇప్పట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీనికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ అని సమాచారం. అసలు విషయంలోకి వెళితే కింగ్డమ్ సినిమా జూన్ మూడవ వారంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే అంత లాంగ్ తీసుకోవడానికి కారణం ఏమిటంటే ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న అనిరుద్ రవిచంద్రన్ ఇంకా బిజిఎం ట్రాక్స్ పూర్తి చేయలేదని సమాచారం. ఈ సమ్మర్ సెలవులను క్యాష్ చేసుకుంటారని విజయ్ దేవరకొండ అభిమానులు ఎంతగానో ఆరాటపడ్డారు. కానీ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ వల్ల సినిమా ఆలస్యం అవుతోందని చెప్పవచ్చు.


అదే సినిమాకి ప్లస్ కానుందా..

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులలో సరికొత్త ఆసక్తిని పెంచేసింది ..జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో రిలీజ్ అయిన ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మనం ఊహించలేని గెటప్తో విజయ్ దేవరకొండ ఆడియన్స్ను ఆకట్టుకోబోతున్నారు. అంతేకాదు ఈసారి ఎలా అయినా సరే హిట్టు కొట్టాలని ఇలాంటి ఒక గొప్ప ప్రయోగాత్మక చిత్రంతో మన ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది..పైగా జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన ఇంట్రడక్షన్ తోనే సినిమా కొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది.

ఇకపోతే పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమా హిందీలో రణబీర్ కపూర్ టీజర్ కి వాయిస్ ఓవర్ ఇవ్వగా.. తమిళ్ లో సూర్య ఇచ్చారు. వరల్డ్ వైడ్ గా మే 30వ తేదీన రిలీజ్ కానుంది అని గతంలో వార్తలు వినిపించినా.. ఇప్పుడు జూన్ మూడవ వారానికి వాయిదా వేసినట్లు సమాచారం. ఇక దీనిపై పూర్తి నిజా నిజాలు తెలియాలి అంటే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించే వరకు చూడాల్సిందే. ఎన్టీఆర్ వాయిస్, విజయ్ యాక్షన్, అనిరుద్ మ్యూజిక్ సినిమాకి బాగా సెట్ అయ్యాయని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Kalyan Ram: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జాతరే.. తమ్ముడు వస్తున్నాడు

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×