Jacqueline Fernandez:బాలీవుడ్ లో హీరోయిన్ గా పేరుపొందిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. గత కొద్దిరోజులుగా ఈమె తల్లి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నది. అయితే ఈ రోజున జాక్వెలిన్ తల్లి గుండెపోటుతో మరణించినట్లుగా తెలుస్తోంది. దీంతో జాక్వెలిన్ అభిమానులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. జాక్వెలిన్ తల్లి మరణ వార్తతో ఆమె చాలా కృంగిపోయిందని, అంత్యక్రియలు కూడా కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలోనే జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత నెల 24వ తేదీన జాక్వెలిన్ తల్లి గుండెపోటుతో లీలావతి ఆసుపత్రిలో చేరడం జరిగింది. అప్పటినుంచి తన తల్లిని దగ్గరుండి మరీ చూసుకుంటున్నది.
తల్లి కోసం ఐపీఎల్ ఆఫర్ కూడా వదులుకున్న జాక్వెలిన్..
ముఖ్యంగా మార్చి 26న గౌహతిలో జరిగే ఐపీఎల్ వేడుకలలో కూడా ఈమె ప్రదర్శన ఇవ్వాల్సి ఉండగా.. ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న తల్లిని చూడడానికి ఐపీఎల్ ఆఫర్ ను కూడా వదులుకుందట. గతంలో 2022లో కూడా జాక్వెలిన్ తల్లి కిమ్ గుండెపోటుతో బహ్రెయిన్ లోని ఒక హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు. ఆమె బహ్రెయిన్ లోని మనమాలో నివసించేవారు. ఆమెకు మలేషియా, కెనడియన్ వారసత్వం కూడా ఉంది. అంతేకాదు ఆమె తల్లి తరఫు తాత కెనడాకు చెందినవారు. ఆమె ముత్తాతలు భారతదేశంలోని గోవాకు చెందినవారు కావడం గమనార్హం. మొత్తానికి అయితే వీరు విదేశీయులైనా.. మూలాలు మాత్రం ఇండియాలోనే ఉండడంతో వీరిపై మరింత ఆదరణ పెరిగింది. అయితే ఇప్పుడు ఆమెకున్న తోడు కూడా దూరం అవడంతో అభిమానులు మరింత దిగ్భ్రాంతికి లోనవుతున్నారు.
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కెరియర్..
శ్రీలంకకు చెందిన ఈమె.. 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా ఎంపిక అయింది. శ్రీలంక తరఫున 2006లో మిస్ యూనివర్స్ పోటీకి కూడా వెళ్లిన ఈమె సిడ్నీ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసింది. అంతేకాదు శ్రీలంకలో టీవీ రిపోర్టర్ గా కూడా పనిచేసిన ఈమె.. 2009 లో అలాడిన్ అనే ఫాంటసీ డ్రామా కోసం ఆడిషన్ చేసి.. ఈ ప్రాజెక్టు ద్వారానే నటిగా కెరియర్ ప్రారంభించింది. 2011లో ఈమె నటించిన మర్డర్ 2 సినిమా ద్వారా మొదటి విజయాన్ని అందుకున్న ఈమె.. ఈ సినిమా తర్వాత ఎక్కువగా గ్లామర్ పాత్రలే పోషించింది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతోంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు పలు చిత్రాలలో నటించిన ఈమె.. మనీ లాండరింగ్ కేసులో కూడా ఇరుక్కున్న విషయం తెలిసిందే. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుఖేష్ చంద్రశేఖర్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొంటున్న అతడు తీహార్ జైల్లో కూడా ఉన్నాడు. ఈ కేసులో ఏడు కోట్లకు పైగా ఆస్తులను ఆమె సుకేష్ చంద్రశేఖర్ నుండి తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు.. అంతేకాదు ఈమెను విచారణ కూడా చేసిన విషయం తెలిసిందే.
also read : JayaPrakash Reddy: సినిమా ఇండస్ట్రీ నా జీవితాన్ని అప్పుల్లో ముంచేసింది.. కానీ..!