Bumrah Joins MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో… ముంబై జట్టులోకి ( Mumbai ) భయంకరమైన బౌలర్ వచ్చేసాడు. దాదాపు నాలుగు నెలలుగా క్రికెట్ కు దూరమైన… ముంబై స్టార్ ఆటగాడు జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) మళ్లీ జట్టులోకి తిరిగి వచ్చేసాడు. ఈ మేరకు ముంబై యాజమాన్యం అధికారికంగా ప్రకటన చేసింది. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ఆడేందుకు ముంబై పేస్ బౌలర్… జస్‌ప్రీత్ బుమ్రా సిద్ధమైనట్లు వెల్లడించింది. తాజాగా ముంబై జట్టులో జస్‌ప్రీత్ బుమ్రా చేరిన వీడియోను బయటకు వదిలింది ముంబై యాజమాన్యం.
Also Read: Jofra Archer: అండర్టేకర్ లాగా నిద్ర లేచి..పంజాబ్ ను కూల్చేశాడు ?
ఈ సందర్భంగా ది లయన్ ఈజ్ బ్యాక్ అంటూ ముంబై ఇండియన్స్ ఓ స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేసింది. ఇందులో… ఆయన భార్య సంజన గణేషన్… తన కొడుకు అంగద్ కు… జస్‌ప్రీత్ బుమ్రా ఐపిఎల్ జర్నీ గురించి ఓ కథలగా చెబుతున్నట్లు ఈ వీడియోలో వివరించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా… ఇవాళ ముంబై జట్టులో చేరిన ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా… కొన్ని రోజుల పాటు ప్రాక్టీస్ చేయబోతున్నాడు. నేరుగా తుది జట్టులోకి అతన్ని పంపే అవకాశాలు లేనట్లే అని తెలుస్తోంది.
రేపు ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Mumbai Indians vs Royal Challengers Bangalore ) మధ్య ఫైట్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండబోడని తెలుస్తోంది. ముంబై ఆడే తర్వాతి మ్యాచ్ లో… బుమ్రా ఆడతాడని సమాచారం. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ తర్వాత… ఢిల్లీ క్యాపిటల్స్ తో ఈ నెల 13వ తేదీన ముంబై ఇండియన్స్ ఫైట్ ఉండనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో జస్‌ప్రీత్ బుమ్రా తుది జట్టులో దిగబోతున్నాడు. అప్పటి వరకు అందరూ ఆగాల్సిందే అని తెలుస్తోంది.
Also Read: Pakistan: పాకిస్థాన్ టీంలో ముసలం.. ఫ్యాన్స్, క్రికెటర్స్ దారుణంగా కొట్టుకున్నారు ?
ఆస్ట్రేలియాలోని బుమ్రాకు గాయం
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 2024 సంవత్సరం చివరలోనే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరిగింది. అయితే… ఈ టోర్నమెంట్ చివరి దశకు వచ్చేసరికి జస్‌ప్రీత్ బుమ్రా గాయమైంది. దీంతో అప్పటి నుంచి టీమిండియా తో పాటు ఇతర మ్యాచ్లకు కూడా జస్‌ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. దీని కోసం విదేశాల్లో కూడా వైద్యం చేయించుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో కూడా జస్‌ప్రీత్ బుమ్రాను మొదట సెలెక్ట్ చేసిన భారత క్రికెట్ నియంత్రణ ( BCCI)… ఆ తర్వాత వరుణ్ చక్రవర్తిని తీసుకుంది. ఐపీఎల్ ప్రారంభాని కంటే ముందే కోరుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ ఐపీఎల్ లో దాదాపు 17 మ్యాచ్లు పూర్తయిన తర్వాత జట్టులోకి వచ్చాడు బుమ్రా. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్లో జస్‌ప్రీత్ బుమ్రా రీయంట్రీ ఇవ్వబోతున్నాడు.
𝑹𝑬𝑨𝑫𝒀 𝑻𝑶 𝑹𝑶𝑨𝑹 🦁#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL pic.twitter.com/oXSPWg8MVa
— Mumbai Indians (@mipaltan) April 6, 2025