Badminton Trainer Rape| పాఠశాలలో విద్యార్థులకు క్రీడల శిక్షణ ఇచ్చే ఒక స్టోర్స్ టీచర్ తన గురువు స్థానాన్ని మరిచి కీచకుడిగా మారాడు. ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసినందుకు అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కేసులో విచారణ చేయగా.. అతను మరో 8 మంది విద్యార్థినులను లొంగదీసుకున్నాడని తెలిసింది. మరో షాకింగ్ విషయమేమిటంటే అతని బండారం బయటపెట్టింది మరెవరో కాదు.. బాధితురాలి అమ్మమ్మ.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరులో హుళిమావు ప్రాంతం పోలీసులు స్థానకంగా ఒక స్కూల్ లో బ్యాడ్మింటన్ కోచ్ గా ఉద్యోగం చేస్తున్న సురేశ్ బాలాజీ (26)ని అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన సురేశ్ బాలాజీ.. బెంగుళూరు నగరంలో గత రెండేళ్లుగా బ్యాడ్మింటన్ కోచ్ గా ఉద్యోగం చేస్తూ.. అక్కడే స్థిరపడ్డాడు. అయితే శనివారం సురేశ్ బాలాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక 16 ఏళ్ల విద్యార్థినిపై అతను లైంగిక దాడి చేశాడనే ఆరోపణలు రావడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.
Also Read: హెడ్స్ పడితే చంపేస్తా.. లేకపోతే రేప్ చేస్తా.. యువతి శవంతో ఆ పని చేసిన సైకో
పోలీసుల వివరాల ప్రకారం.. గత రెండేళ్లుగా హాసిని (పేరు మార్చబడినది) అనే 16 ఏళ్ల అమ్మాయి.. సురేశ్ బాలాజీ వద్ద గత రెండేళ్లుగా బ్యాడ్మింటన్ నేర్చుకుంటోంది. కొంతకాలం క్రితం ఆమెను నిందితుడు సురేశ్ బాలాజీ మాయ మాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ దురాగతాన్ని పైశాచికంగా వీడియో, ఫొటోలు తీశాడు. ఆ ఫొటోలు చూపిస్తూ ఆ విషయం గురించి బయట ఎవరికీ చెప్పకూడదని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఆ తరువాత కూడా అతను పలుమార్లు ఆమెను ఆ ఫొటోలు చూపిస్తూ లొంగదీసుకున్నాడు.
బండారం బయటపడిందిలా..
ఇటీవల హాసిన స్కూల్ సెలవులు ఉండడంతో తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడ తన అమ్మమ్మ ఫోన్ ద్వారా బట్టలు లేకుండా ఫొటోలు తీసి సురేశ్ బాలాజీకి పంపింది. అయితే పొరపాటున ఆ ఫొటోలు ఆమె అమ్మమ్మ కంట బడ్డాయి. దీంతో ఆమె హాసిని తల్లిదండ్రులకు విషయం తెలియజేసింది. వెంటనే సురేశ్ బాలాజీ పై ఫిర్యాదు చేయాలని సూచించింది. దీంతో ఫిర్యాదు అందుకున్న పోలీసులు సురేశ్ బాలాజీని అతన ఇంటి నుంచి అరెస్ట్ చేశారు. ఆ తరువాత అతని మొబైల్ ఫోన్, లాప్ టాప్ ని స్వాధీనం చేసుకొని పరిశీలించగా.. మరో 8 మంది అమ్మాయిల అశ్లీల ఫొటోలు, వీడియోలు అందులో ఉన్నట్లు తేలింది. వారంతా 13 నుంచి 16 ఏళ్ల బాలికలని పోలీసులు వెల్లడించారు.
ఈ కేసులో మిగతా బాధితుల నుంచి కూడా పోలీసులు స్టేట్ మెంట్ తీసుకొని విచారణ చేస్తున్నారు. “తన వద్ద బ్యాడ్మింటన్ శిక్షణ తీసుకుంటున్న బాలికలను లొంగదీసుకోవడం వారిని లైంగికంగా వేధిస్తూ.. వారి అశ్లీల వీడియోలు రికార్డ్ చేయడం నిందితుడి అలవాటు” అని పోలీసులు తెలిపారు.