Gundeninda GudiGantalu Today episode April 21th : నిన్నటి ఎపిసోడ్ లో.. కామాక్షి నీకు రూమ్ కూడా లేదు అని ఏద్దేవా చేస్తుంది. ఇక ప్రభావతి తన బిజినెస్ గురించి చెబుతుంది. ప్రభావతి స్పందిస్తూ నాకంటూ ప్రత్యేకమైన గదిలో లేకుండా పోయిందని అంటుంది. పైన ఒక గది కట్టించుకోని హాయిగా ఉండండి అని బదులిస్తుంది. దానికి ప్రభావతి కూడా స్పందిస్తూ అదే అనుకున్నాం. కానీ అందరికి సరిపడా రూమ్ లు ఉంటే బాలు, మీనాను బయటికి గెంటేయడం వీలవ్వదు కదా అని అంటుంది. వారిని బయటికి పంపించాక మూడంతస్తుల మేడ కట్టుకుంటామని ఇక్కడ హాల్, ఇక్కడ టీవీ యూనిట్, ఇక్కడ స్విమ్మింగ్ ఫూల్ అని చెబుతుంది.. పూల కొట్టు గురించి మాట్లాడుతుంది. దాన్ని పీకేస్తే అదే పోతుందని అంటుంది. ప్రభావతి మాత్రం గొప్పగా బిజినెస్ గురించి గొప్పగా చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు కార్ రైడ్ కోసమని బయటికి వెళ్తాడు. ఈ క్రమంలో ఒక రైడ్ రోహిణి పార్లర్ కు పడుతుంది. నేరుగా అక్కడికి వెళ్లిన బాలు కారు ఎక్కిన ఆవిడా డబ్బులు ఇవ్వకపోవడంతో పార్లర్ లోకి వెళ్తాడు. డబ్బులు ఇవ్వమని అడిగి తీసుకుంటాడు. అయితే అప్పటికే ఆ పార్లర్ లో మాణిక్యం, రోహిణి, స్నేహితురాలు దివ్య ఉంటుంది. మాణిక్యం ను అక్కడ నుంచి మెల్లగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అయితే బాలు అక్కడకు వచ్చి డబ్బులు ఇవ్వలేదు మేడం అని లోపలికి వెళ్లి అడుగుతాడు.
రోహిణిని వాళ్ల ఓనర్ రోహిణిని పిలుస్తూ ఉంటుంది. మరోవైపు పార్లర్లోని అన్ని పనులను చేయిస్తూ ఉంటుంది. అన్ని పనులు సరిగా చూసుకోవాలని కూడా చెబుతూ ఉంటుంది. ఇవన్నీ బాలు గమనిస్తూ ఉంటాడు. మరోవైపు పార్లర్లోని అన్ని పనులను చేయిస్తూ ఉంటుంది. అన్ని పనులు సరిగా చూసుకోవాలని కూడా చెబుతూ ఉంటుంది. ఇవన్నీ బాలు గమనిస్తూ ఉంటాడు. ఇక పార్లర్ తనది కాదనే నిజం తెలిసిపోవడంతో రోహిణి గుట్టు ఇంట్లో బయట పెట్టాలని ప్రయత్నిస్తాడు. ముందుగా ఈ విషయాన్ని సత్యంతో చెప్పాలని బాలు అక్కడికి వెళ్తాడు. నిజం చెప్పిన మొదట నమ్మడు కానీ బాలు చూపించిన ఆధారాలతో బాలు చెప్పేది నిజమే అని నమ్ముతాడు.
నువ్వు బయట పెడితే గొడవలు జరుగుతాయి నువ్వు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని సత్యం అంటాడు ఇక సత్యం మాట విన్న బాలు అలాగే నాన్న నా నోటి నుంచి నిజం బయటకు రాకుండా చూసుకుంటాను అంటాడు. బాలు, సత్యం ఇంటికి వెళ్తారు.. వెళ్లగానే రోహిణి కూడా పార్లర్ నుంచి తిరిగి వస్తుంది. దీంతో ప్రభావతి ఇవ్వాళ బాగా పనిచేశావు అనుకుంటా అమ్మ అని అంటుంది. దాంతో బాలు అవును ఆవిడ పార్లర్ లో బ్యూటీషన్లే కంటే ఓనర్లే ఎక్కువ పనిచేస్తున్నారని అంటాడు.. అందరు బాలు విని షాక్ అవుతారు. రోహిణి నిజం తెలిసి పోయిందా? అని కంగారు పడుతుంది.
నేను చాలా అలసిపోయాను ఆంటీ నేను వెళ్లి రెస్ట్ తీసుకుంటానని రోహిణి అనగానే ప్రభావతి నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో అమ్మ నీకు జ్యూస్ ని నేను పైకి పంపిస్తానని అంటుంది. కామాక్షి నేను వెళ్ళిపోతాను అని ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. బాలు కూడా నాకు కూడా ఒక ఆరంజ్ తీసుకురా మీనా అని అంటాడు. దానికి ప్రభావతి నాకు పోటీన నువ్వు మీనా నువ్వు ముందు రోహిణికి జ్యూస్ చేసి ఇవ్వు అని అంటుంది. తర్వాత అదే రోజు రాత్రి బాలు నాకు ఆకలేస్తుంది మీనా దోస కావాలని వంటగదిలోకి వెళ్తాడు. ఆ తర్వాత పూల కొట్టులో పనికివైతుందా అయితే ఒక పని మనిషిని పెట్టుకో అంటాడు. మీనా రోహిణి అంటే పెద్ద పార్లర్ పెట్టింది పనికి ఉంటుంది నాకేం పని లేదు కదండీ అని అనగానే మీనాకు నిజం చెప్పాలని అనుకుంటాడు. అప్పుడే సత్యం వచ్చి నిజం చెప్పద్దని ఆపుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో మీనా ప్రభావతి మధ్య యుద్ధం జరుగుతుంది.. ఏం జరుగుతుందో చూడాలి..