Tamannaah Bhatia : టాలీవుడ్ హీరోయిన్ తమన్నా తెలుగులో ఎన్నో సినిమాలు చేసింది. ఒక్కో సినిమాలో ఒక్కో యాంగిల్ ను పరిచయం చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల అందరి సరసన నటించింది. టాలీవుడ్ లో అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. ఒకవైపు వరుస సినిమాలు, మరోవైపు యాడ్స్ చేస్తూ బిజీగా ఉంది. ఇక తెలుగులోనే కాదు తమిళ్లో కూడా పలు సినిమాలు చేసి ఆకట్టుకుంది. అలాగే ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది. తమన్నా సౌత్ లో ఉన్నప్పుడు రిలేషన్, ప్రేమ పుకార్లు లాంటివి ఏం రాలేదు కానీ ఎప్పుడైతే బాలీవుడ్ లోకి వెళ్లిందో అక్కడే తన బెస్ట్ హాఫ్‌ని వెతుక్కుంది.. అతనితో రిలేషన్ లో ఉంది. వీరిద్దరి పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈమె బాయ్ ఫ్రెండ్ వింత వ్యాధితో బాధ పడుతున్నాడని ఓ వార్త షికారు చేస్తుంది.. అసలు ఆ వ్యాధి ఏంటో తెలుసుకుందాం..
తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ తెలుగులో ఓ సినిమా చేశాడు. అలాగే పలు సూపర్ హిట్ లు, వెబ్ సిరీసుల్లో నటించి స్టార్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మీర్జాపూర్ వెబ్ సిరీస్, గల్లీ బాయ్స్, డార్లింగ్ వంటి హిందీ చిత్రాల్లో తన నటన తో బాలీవుడ్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాడు. ఈయన సినిమాల పరంగా కన్నా తమన్నాతో రిలేషన్ లో ఉన్నాడనే వార్తల వల్ల బాగా ఫెమస్ అయ్యాడు.. తాజాగా ఆయనకు ఉన్న వింత వ్యాధిని బయట పెట్టి అందరికి షాక్ ఇచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో విజయ్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్పాడు. తాను అరుదైన చర్మ సమస్యతో ఇబ్బంది పడుతున్నానని, దాన్ని మేకప్ తో కవర్ చేస్తున్నానని చెప్పాడు. ఈ మాట విన్న ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు..
ఇటీవల తన వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ ఈ విషయాన్ని చెప్పాడు. తాను విటిలిగో అనే చర్మ సమస్య తో బాధపడుతున్నానన్నాడు. దాని వల్ల తన ముఖంపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయని, వాటిని దాచడానికి మేకప్ కాస్మోటిక్స్ ఉపయోగించాల్సి ఉంటుందని ఈ నటుడు వెల్లడించాడు. దీని గురించి మొదట్లో చాలా భయపడ్డాను, సక్సెస్ అందుకున్న తరువాత దాని గురించి ఆలోచించడం మానేసాను అని విజయ్ తెలిపాడు.. ఈ వ్యాధి అరుదైనది. శరీరం లో ఎక్కడైనా రావొచ్చు అని అన్నాడు. బొల్లికి ఇంకా ఖచ్చితమైన నివారణ లేదు. ఉన్న కొన్ని చికిత్సలు మాత్రమే దాని వ్యాప్తిని ఆపుతాయి. బొల్లి వ్యాధికి ప్రాథమిక లక్షణాలు కనిపించినప్పుడు మందులు, క్రీముల తో మ్యానేజ్ చెయ్యాలని అన్నాడు. లేదంటే లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలని అన్నారు. ఇక తమన్నా, విజయ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని టాక్.. పెళ్ళైక కొత్త ఇంట్లో కాపురం పెట్టనున్నారని టాక్.. ముంబై లో కొత్త ఇల్లు కూడా కొన్నట్లు సమాచారం.