Tamannah Bhatia: తెలుగు నుండి పాన్ ఇండియా సినిమాలు అసలు రాగలవా అని దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అనుకుంటున్న సమయంలో ‘బాహుబలి’ వచ్చి తెలుగు సినీ పరిశ్రమ రూపురేఖలనే మార్చేసింది. ఆ సినిమా తర్వాత మరెన్నో తెలుగు సినిమాలకు పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించవచ్చనే నమ్మకం వచ్చింది. ఆ ఒక్క మూవీ వల్ల ఎంతోమంది జీవితాలు చాలా మారిపోయాయి. దర్శకుడిగా రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని పెంచిన డైరెక్టర్స్ లిస్ట్‌లో జాయిన్ అయ్యారు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అలాగే అందులో హీరోయిన్‌గా నటించిన తమన్నాకు కూడా మంచి గుర్తింపు లభించింది. ‘బాహుబలి’ వల్ల తనకు వచ్చిన గుర్తింపు గురించి తమన్నా (Tamannah Bhatia) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
పెద్ద కన్ఫ్యూజన్
‘బాహుబలి 2’లో తమన్నా క్యారెక్టర్‌కు అంతగా గుర్తింపు లభించలేదు. కానీ పార్ట్ 1లో మాత్రం అవంతిక అనే పాత్రలో తమన్నా తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. గ్లామర్ మాత్రమే కాదు.. తనకు మంచి పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రను అందించారు రాజమౌళి. దీంతో తన గ్లామర్, పర్ఫార్మెన్స్‌కు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయిదేళ్లు కష్టపడి టీమ్ అంతా ‘బాహుబలి’ రెండు భాగాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇక ఆ సినిమాలు పూర్తయిన తర్వాత అసలు తాను ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉండిపోయానని తమన్నా చెప్పుకొచ్చింది. తన తర్వాతి ప్రాజెక్ట్స్‌పై చాలా కన్ఫ్యూజన్ ఏర్పడిందని తాజాగా బయటపెట్టింది.
Also Read: మ్యూజిక్ డైరెక్టర్ ను మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న సింగర్ సుచిత్ర
సక్సెస్ ఫార్ములా ఏంటి?
‘బాహుబలి’ (Bahubali) తర్వాత తన మనసులో మొదలయిన ఆలోచనల గురించి గుర్తుచేసుకుంది తమన్నా. ‘‘బాహుబలి కంటే పెద్ద సినిమాను చేయడం ఎలా? అసలు దీని తర్వాత ఏం చేయాలి? దీనికంటే పెద్ద సినిమా ఏదైనా చేయాలా? లేదా నేను అలాంటి సినిమాను కనిపెట్టాలా?’’ అని ఆలోచించిందట. ఇదే సక్సెస్ ఫార్ములాను ఫాలో అవ్వాలా లేదా కొత్త దారిలో ప్రయాణం మొదలుపెట్టాలా అని కన్ఫ్యూజ్ అయ్యిందట. దాంతో పాటు సౌత్‌లో అడుగుపెట్టిన మొదట్లో అసలు భాషలు రాకుండానే నటించేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. దాదాపు అన్ని సౌత్ భాషల్లో తమన్నా అడుగుపడినా.. తన కెరీర్ ప్రారంభించిన కొత్తలో మాత్రం ఈ భాషలేవీ తనకు వచ్చేవి కాదట.
దాంతోనే బ్రేక్
ప్రస్తుతం తమన్నా.. తమిళ, తెలుగు సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ బిజీగా గడిపేస్తోంది. సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా నార్త్ అమ్మాయి అయినా కూడా తెలుగు, తమిళంలో స్పష్టంగా మాట్లాడగలుగుతుంది. ఇది తన కెరీర్‌కు పెద్ద ప్లస్ అని తాను భావిస్తున్నట్టు తమన్నా తెలిపింది. సౌత్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టిన కొత్తలో తమన్నాకు పెద్దగా హిట్లు దక్కలేదు. అసలు తెలుగులో తన అతిపెద్ద బ్రేక్ అంటే ‘బాహుబలి’ అనే చెప్పాలి. ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లోనే నటిస్తూ అలరించిన తమన్నా.. తాజాగా ‘సికిందర్ కా ముకద్దర్’ అనే థ్రిల్లర్‌లో నటించి అందరినీ అలరించింది. ఈ మూవీ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యింది.