BigTV English
Advertisement

K Prathiban: ఆ నటితో శ్రీకాంత్ అడ్డాల ఎఫైర్.. షాకింగ్ కామెంట్స్ చేసిన తమిళ సీనియర్ నటుడు..!

K Prathiban: ఆ నటితో శ్రీకాంత్ అడ్డాల ఎఫైర్.. షాకింగ్ కామెంట్స్ చేసిన తమిళ సీనియర్ నటుడు..!

 K Prathiban: ప్రముఖ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. దర్శకుడిగా, పాటల రచయితగా, అసోసియేటెడ్ డైరెక్టర్ గా కూడా పలు సినిమాలకు పనిచేసిన ఈయన.. 2008లో వచ్చిన ‘కొత్త బంగారులోకం’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడిగా తొలిసారి పరిచయమయ్యారు. ఈ సినిమా మంచి విజయం అందుకోవడమే కాదు.. శ్రీకాంత్ అడ్డాలకు మంచి పేరు కూడా అందించింది. ఆ తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక తర్వాత బ్రహ్మోత్సవం, నారప్ప వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన.. మళ్ళీ ఇంకో చిత్రానికి దర్శకత్వం వహించలేదు. అయితే సడన్గా ఏమైందో తెలియదు కానీ గత ఏడాది శ్రీకాంత్ అడ్డాల తన భార్య కన్నుగప్పి ఒక కోలీవుడ్ హీరోయిన్ తో ఎఫైర్ నడుపుతున్నాడు అంటూ వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ముఖ్యంగా భార్యను కాదని ఆ హీరోయిన్ తోనే చట్టపట్టలేసుకొని తిరుగుతున్నాడని, అంతేకాదు చెన్నైలో ఒక సెపరేట్ ఇల్లు కూడా తీసి, ఆమెతో సహజీవనం చేస్తున్నాడు అంటూ వార్తలు కోడైకూసాయి. ఇక భార్యను మోసం చేస్తున్నాడు అంటూ వార్తలు రాగా అప్పట్లో ఈ విషయంపై ఏ ఒక్కరు స్పందించలేదు.


శ్రీకాంత్ అడ్డాల ఎఫైర్ రూమర్స్ పై స్పందించిన పార్థిబన్..

అయితే తాజాగా ఈ విషయాలపై ప్రముఖ తమిళ నటుడు ఆర్. పార్థిబన్ (R.Parthiban) తొలిసారి స్పందించి అందరిని ఆశ్చర్యపరిచారు. తాజాగా ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా పార్థిబన్ కు శ్రీకాంత్ అడ్డాల పై ప్రశ్న ఎదురవగా.. ఆయన ఇలా సమాధానమిచ్చారు.. ఆర్. పార్థిబన్ మాట్లాడుతూ.. ” శ్రీకాంత్ అడ్డాల ప్రముఖ నటి ప్రియాతో ఎఫైర్ కొనసాగిస్తున్నారు అంటూ ఒక మెసేజ్ అందరితో పాటు నాకు వచ్చింది. ముఖ్యంగా చాలామంది నాకు ఫోన్ చేసి మరీ ఈ విషయంపై ప్రశ్నించారు. ఎందుకంటే ఆమెను నేనే ఇండస్ట్రీకి తీసుకొచ్చాను కాబట్టి. ఒక షార్ట్ ఫిలిం ద్వారా ఆమె నా తరఫున ఇండస్ట్రీకి పరిచయం అయింది. అందుకేనేమో ఈ ప్రశ్నపై చాలామంది పలు రకాల ప్రశ్నలు గుప్పించారు.


ఆమె చాలా మల్టీ టాలెంటెడ్ – పార్థిబన్

ఒకరకంగా చెప్పాలి అంటే.. ప్రియా మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్. ఉదాహరణకు చెప్పాలి అంటే నేను తీస్తున్న షార్ట్ ఫిలిం లో లిప్ పై ఒక సన్నివేశం ఉంది. అది చాలా కష్టతరమైనది. ముఖ్యంగా నటనలో అనుభవం ఉన్న వారు కూడా అంత త్వరగా ఆ సన్నివేశాన్ని చేయలేరు. కానీ ప్రియా మాత్రం ఒక్క టేక్ లోనే అంత కష్టతరమైన సన్నివేశాన్ని పూర్తి చేసింది. ఆమె మల్టీ టాలెంటెడ్ కూడా.. అలాంటి ఆమె కేవలం నాలుగు చిత్రాలే చేసింది. కానీ ఇలాంటి రూమర్స్ వల్ల తన జీవితాన్ని నాశనం చేసుకుంటుందని అయితే నేను అనుకోవడం లేదు. ఇక తన కెరియర్ ఇలాంటి రూమర్స్ కి అంకితం అవడం నాకు ఇష్టం లేదు. ఆమె టాలెంట్ నీ నిరూపించుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ పార్థిబన్ తెలిపాడు. అంతేకాదు చాలా కాలం అయింది కాబట్టి ప్రస్తుతం ఆమెతో టచ్ లో లేను అని కూడా తెలిపారు పార్థిబన్. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×