ACA Cricket Stadium: నవ్విపోదురుగాక నాకేంటి అన్నట్టు ఉంది వైసీపీ తీరు. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగారు. విచ్చలవిడిగా రెచ్చిపోయారు. సంస్థల పేర్లు మార్చారు. రాళ్లపై ఫోటోలు పెట్టుకున్నారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు పూసుకున్నారు. హద్దూఅదుపూ లేకుండా చెలరేగిపోయారు. పవర్ పోయాక.. ఇప్పుడదే పనులు వారికి రిటర్న్ గిఫ్ట్‌లుగా వస్తుంటే మాత్రం కాలు కాలిన పిల్లిలా చిందులు తొక్కుతున్నారు. విశాఖ క్రికెట్ స్టేడియం పేరు మార్పుపై వైఎస్సార్‌సీపీ నేతలు నానా రచ్చ చేస్తున్నారు. అటు, టీడీపీ సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుండటంతో రచ్చ రంజుగా మారింది.
విశాఖ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంపై ఏపీలో పొలిటికల్ గేమ్ నడుస్తోంది. స్టేడియంకు వైఎస్సార్ పేరు తీసేయడమే లేటెస్ట్ వివాదానికి కారణం. మా నాయకుడి పేరు తొలగిస్తారంటూ వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు. మేటర్ విశాఖ స్టేడియం గురించి కాబట్టి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి ఈ గొడవను లీడ్ చేస్తున్నారు. మీడియా ముందు గొంతు చించుకోవడంతో పాటు.. పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనలకు రెడీ అవుతున్నారు.
విశాఖ స్టేడియంకు వైఎస్సార్ పేరు తీసిపడేయడంపై సోషల్ మీడియాలో ఇరు వర్గాలు బౌన్సర్లు, సిక్సర్లతో పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. పేరు మార్చితే.. ఆ నొప్పి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసొస్తుందా అంటూ వైసీపీని కవ్విస్తున్నారు టీడీపీ, జనసేన వారియర్స్. గతంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఎన్టీఆర్ పేరు తీసేసి.. వైఎస్సార్ అని పెట్టడాన్ని గుర్తు చేసి కామెంట్లతో కుమ్మేస్తున్నారు.
1986లో హెల్త్ యూనివర్సిటీని స్థాపించిందే అప్పటి సీఎం నందమూరి తారకరామారావు. అందుకే, ఆయన పేరు మీద ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టడంలో లాజిక్ ఉంది. అలాంటి ఎన్టీఆర్ పేరును తీసేసి.. గత సీఎం జగన్ తన తండ్రి పేరుతో వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చిన మేటర్ ను ఇప్పుడు మళ్లీ తెరమీదకు తెస్తున్నారు. ఆనాడు ఆయన చేసింది తప్పు కానప్పుడు.. ఇప్పుడు విశాఖ క్రికెట్ స్టేడియంకు వైఎస్సార్ పేరు తీసేయండం కూడా తప్పు కాదని వాదిస్తున్నారు. వైజాగ్ స్టేడియం వైఎస్సార్ ఏమైనా కట్టించాడా? ఆయన పేరు ఎందుకు పెట్టారంటూ గట్టి ఫైటే నడుస్తోంది సోషల్ మీడియాలో. అది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు సంబంధించిన స్టేడియం కాబట్టి ACA పేరు మీదుగా ఉండటమే కరెక్ట్ అంటూ వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్లు పడుతున్నాయి.
పేరులో ఏముందిలే అని పంతానికి పోకుండా.. పవర్ లేనప్పుడు సైలెంట్‌గా పడుండాలి కానీ.. కాదూ కూడదు.. వైఎస్సార్ పేరు తీయొద్దు.. రోడ్ల మీదకు వస్తాం.. రచ్చ చేస్తాం.. అంటే కుదరదు. ఇక్కడుంది కూటమి ప్రభుత్వం. తాట తీస్తారు జాగ్రత్త.. అంటూ తెలుగు తమ్ముళ్లు, జన సైనికులు జగన్ అభిమానులను ఓ ఆటాడుకుంటున్నారు. దమ్ముంటే విశాఖ స్టేడియంకు రండి.. అసలైన ఆడుదాం ఆంధ్రా అంటే ఏంటో చూపిస్తాం అంటూ సవాళ్లు విసురుతున్నారు.