KS Ravikumar : తమిళ స్టార్ డైరెక్టర్ కే.ఎస్ రవికుమార్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితమే. ఇటీవల ఆయన పేరు ఎక్కువగా వార్తల్లో వినిపించింది. ప్రస్తుతం ఆయన ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రవికుమార్ తల్లి రుక్మిణి అమ్మాళ్ కన్నుమూశారు. ఆమె గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో పోరాడుతుంది. ఈ మధ్య అనేకసార్లు హాస్పిటల్ లో చికిత్స పొందారు. ఇక ఆమె ఆరోగ్యం క్షీణించడంతో తుది శ్వాస విడిచారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.. ఈ వార్త విన్న ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. రుక్మిణి అమ్మాళ్ నిన్న చనిపోయారని తెలుస్తుంది. నేడు ఆమెకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తల్లి మరణం ఆయనకు తీరని లోటు అనే చెప్పాలి. రవికుమార్ తల్లి అంత్యక్రియలకు దగ్గర బంధువులతో పాటుగా సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఆమెకు అంత్యక్రియలను సొంత ఊరిలోనే నిర్వహించనున్నారు.. ఇక ఈ డైరెక్టర్ కు తెలుగులో కూడా సినిమాలు తీసి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్నేహం కోసం, నాగార్జున హీరోగా బావ నచ్చాడు, రాజశేఖర్ హీరోగా విలన్, బాలయ్య హీరోగా జైసింహా, రూలర్ లాంటి సినిమాలు తీశారు. తెలుగులో మంచి విజయం సాధించిన భద్ర మూవీని.. తమిళం లో శింబు హీరోగా రీమేక్ చేశారు. అలాగే 2008 లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన దశావతారం సినిమాను డైరెక్ట్ చేసింది కూడా ఈ డైరెక్టరే. ఈయన భారీ చిత్రాలను తెరకెక్కించడం తో నిష్ణాతుడిగా పేరును అందుకున్నాడు. అయితే ఫ్యామిలీ గురించి మన తెలుగు వాళ్లు చాలా మందికి తెలియకపోవచ్చు. కె.ఎస్. రవికుమార్‌కు మొత్తం ముగ్గురు కుమార్తెలు ఉన్నారు..
హీరోయిన్లను మించిన చక్కని అందం, హీరోయిన్ మెటరియల్స్ అయిన తన ముగ్గురు కూతుర్లను సినిమాల్లోకి తీసుకురాలేదు. కేవలం చదువులకే పరిమితం చేశారు. బాగా చదువుకున్నారు. ఆయన కూతుర్లను ఎప్పుడు సినిమా ఫంక్షన్లకు తీసుకురాలేదని తెలుస్తుంది. ఇక తన చిన్న కూతురు జస్వంతి కు సోషల్ మీడియాలో హీరోయిన్ కన్న ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. హీరోయిన్ ఫీచర్స్ ఉండే ఈ అమ్మాయి ఖతర్నాక్ ఫోటోలతో నెట్టింట సెన్సేషనల్‌గా మారిపోయింది. ఈ అమ్మడు ఫోటోలు చూసి.. ఇంతకాలం ఈమె హీరోయిన్ కాకుండా ఎందుకు ఉంది అని కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్‌గా ఉంటూ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటుంది. ఆ ఫోటోలు ఎంతగా వైరల్ అవుతున్నాయో చెప్పానక్కర్లేదు.. మరి ఫ్యూచర్లో హీరోయిన్ అవుతుందేమో చూడాలి.
ఇకపోతే తనకు అవకాశాలిచ్చిన హీరోలపై వివాదాస్పద కామెంట్స్ చేస్తుంటారు తమిళ దర్శకుడు. గతంలో బాలయ్య వ్యక్తిత్వం గురించి రెండు సందర్భాల్లో రెండు రకాలుగా మాట్లాడి సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురయ్యాడు ఇటీవల రజినీకాంత్ పై కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు.