CID Look out notice: కాకినాడ సీ పోర్టు వ్యవహారం వైసీపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోందా? కూటమి సర్కార్‌లో రోజుకో కేసు తెరపైకి రావడంతో నేతలు బెంబేలెత్తుతున్నా రా? మొన్న ముంబై నటి జత్వానీ కేసు.. నిన్న సోషల్ మీడియా వ్యవహారం.. నేడు కాకినాడ సీ పోర్టు ఇష్యూ.. ఇలా ఒకదాని తర్వాత మరొకటి వైసీపీ కీలక నేతలను వెంటాడుతున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ టెన్షన్ పడుతున్నట్లు కనిపిస్తున్నారు. కూటమి సర్కార్ లేవనెత్తిన అంశాలపై మీడియా ముందుకొచ్చి తనదైన శైలిలో వివరణ ఇచ్చేవారు. కానీ బుధవారం మీడియా సమావేశంలో కంప్లీట్‌గా ప్రజా సమస్యలపై ఫోకస్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఉన్నట్లుండి జగన్ రూట్ మార్చడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయట.
కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో పార్టీ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయ్యింది. సీఐడీ కేసు నమోదు చేయడంతో అరబిందో కంపెనీ షేర్లను మదుపరులు అమ్మకాలకు పాల్పడ్డారు. దీంతో ఆ కంపెనీ షేరు నేల చూసింది. బుధవారం రోజంతా నేషనల్ మీడియాలో కాకినాడ పోర్టు వ్యవహారంపై చర్చ సాగింది.
పోర్టు ఇష్యూ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు జగన్ మీడియా ముందుకొచ్చారన్నది కూటమి నేతల మాట. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. ఏపీలో కేసులు నమోదు తర్వాత వైసీపీ మద్దతుదారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. దీన్ని ముందుగానే గమనించారు పోలీసులు.
ALSO READ: విపక్షానికి సీఎం చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్!
కాకినాడ పోర్టు వ్యవహారం కేసు విచారణ చేస్తున్న ఏపీ సీఐడీ విభాగం లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేసింది. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డిపై ఎల్వోసీ ఇచ్చింది.
ఈ ముగ్గురు విదేశాలకు పారిపోకుండా ముందు జాగ్రత్తగా ఈ సర్క్యులర్ జారీ చేసింది. గతంలో కాకినాడ సీ పోర్టుకు సంబంధించి కోట్ల రూపాయలు విలువ చేసే వాటాలను తన నుంచి బలవంతంగా లాక్కున్నారంటూ కేవీ రావు సీఐడీకి ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసులో వీరంతా కీలక నిందితులుగా ఉన్నరని భావించిన సీఐడీ లుక్ అవుట్ సర్య్కులర్ జారీ చేశారు. త్వరలో ఈ ముగ్గుర్ని విచారించేందుకు సీఐడీ సిద్ధమవుతోంది.
కాకినాడ సీ పోర్టు వ్యవహారంపై బుధవారం మీడియా చిట్ చాట్‌లో ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. అధికారంలో ఉన్నవారు ప్రైవేటు వ్యక్తుల నుంచి ఆస్తులు బలవంతంగా తీసుకోవడం ఎప్పుడూ వినలేదన్నారు. ఇలాంటివి కంట్రోల్ చేయడానికి కఠినమైన చట్టాలు అవసరమని మనసులోని మాట బయటపెట్టారు.
ఇదిలావుండగా అరబిందో కంపెనీ కోసమే జగన్ సర్కార్ అంబులెన్సులకు నెలవారీ ఇవ్వాల్సిన అద్దె పెంచిందని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి. దీని కారణంగా ప్రభుత్వ ఖజానా నుంచి 175 కోట్లు అధికంగా చెల్లించారన్నది ప్రధాన ఆరోపణ. 2019 వరకు అంబులెన్సులకు నెలకు 1.30 లక్షలు చెల్లించేవారు. అరబిందోకు ఇచ్చిన తర్వాత ఆ మొత్తాన్ని అమాంతంగా పెంచారన్నారు.
#PortKabzaByJagan#AndhraPradesh https://t.co/36VoXK4pcR
— Telugu Desam Party (@JaiTDP) December 4, 2024