New Ministers: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ ముగ్గురు అభ్యర్థులకు మంత్రి పదవుల కోసం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, 18 మంది మంత్రులతో కూడిన మంత్రివర్గంలో ప్రస్తుతం ఆరు ఖాళీలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త మంత్రుల నియామకం కోసం హైకమాండ్‌తో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. మూడు పేర్లు దాదాపు ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ లిస్ట్‌లో నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలకు మంత్రి పదవులు దక్కినట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురు మంత్రులు రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు వీరు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరికి, మాదిగ సామాజిక వర్గం నుంచి సత్యనారాయణకు, మాల వర్గం నుంచి గడ్డం వివేక్‌కు మంత్రి పదవి దక్కినట్టు సమాచారం. దాదాపు ఇవే పేర్లు ఖరారైనట్టు తెలుస్తోంది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.