Bhupalapally District News: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మేడిగడ్డ వద్ద గోదావరిలో పడి ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. మరో ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడినట్టు తెలుస్తోంది. గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
వివరాలు ఇలా ఉన్నాయి. మహదేవపూర్ మండలం అంబాట్ పల్లి దగ్గరలో గల మేడిగడ్డ బ్యారేజీ ఎగువ ప్రాంతంలో గోదావరిలో ఆరుగురు విద్యార్థులు స్నానం చేసేందుకు వెళ్లారు. దీంతో గోదావరి దిగిన ఆరుగురు గల్లంతయ్యారు. దీనిలో ఇద్దరు సురక్షితంగా బయటపడినట్టు తెలుస్తోంది. గల్లంతైన వారందరూ 18 ఏళ్ల వయస్సు ఉన్నట్టు సమాచారం. వీరిలో నలుగురు అంబాట్ పల్లికి చెందినవారు కాగా.. మరి ఇద్దరు మహముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ విషాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Encounter: మళ్లీ భారీ ఎన్‌కౌంటర్.. దండకారణ్యంలో మెయిన్ టార్గెట్ అతడేనా?