Tamannaah Bhatia: ఒక వయస్సు వచ్చాక ఎవరికైనా సరే పెద్దరికం వస్తుంది. ఒక మెచ్యూరిటీ వస్తుంది. ఆ వయస్సుకు తగ్గట్లు ప్రవర్తిస్తే ఆ పెద్దరికం నిలబడుతుంది. కానీ, కొంతమందికి వయస్సు పెరిగినా ఎలా మాట్లాడాలి అనేది తెలియదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే .. 35 ఏళ్ళు వచ్చిన తమన్నా ఈ వయస్సులోనే ఎంతో పెద్దరికంగా ఆలోచించింది. అసలు తమన్నా ఏం చేసింది అనేది తెలుసుకుందాం.
అందాల భామ తమన్నా.. బాలీవుడ్ బ్యూటీగా మారిపోయింది. నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడిన దగ్గరనుంచి ఎక్కువ బాలీవుడ్ ఫంక్షన్స్ లో, ఈవెంట్స్ లో ఈ జంట మెరుస్తున్నారు. ఇక తాజాగా తమన్నా, విజయ్ కలిసి ఒక ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్ కు కుర్ర హీరోయిన్ రాషా తడానీ వచ్చింది. రాషా ఎవరో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ ముద్దుల తనయ.
రవీనా టాండన్ .. తెలుగు, హిందీలో ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులో అయితే బాలయ్య సరసన బంగారు బుల్లోడు, నాగార్జున సరసన ఆకాశ వీధిలో.. మోహన్ బాబు సరసన పాండవులు పాండవులు తుమ్మెద లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇక కెజిఎఫ్ 2 సినిమాలో రవీనా.. రమైకా సేన్ గా ఆమె నటనకు ఫిదా అయ్యారు.
కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే రవీనా.. అనిల్ తడానీని వివాహమాడింది. ఈ జంటకు నలుగురు పిల్లలు. రాషా తడానీ మొదటి కుమార్తె. ఆమెకు 19 ఏళ్లు. ఇక తల్లిలానే కూతురు కూడా అందాల బొమ్మ. అచ్చు గుద్దినట్లు అమ్మను అందంలో దింపేసింది. 19 ఏళ్లకే రాషా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆమె నటించిన డెబ్యూ చిత్రం ఆజాద్. అజయ్ దేవగణ్ కుమారుడు ఆమన్ దేవగణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా మూడు రోజుల క్రితం రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.
Actor Balaji: విలన్ రఘువరన్ నా బావ.. ఆయన చనిపోవడానికి కారణం అదే.. అసలు నిజం బయటపెట్టిన బాలాజీ
ఇక ఆజాద్ సినిమా సక్సెస్ ఈవెంట్ లో స్టార్ సెలబ్రిటీస్ సందడి చేశారు. ఇక ఆ ఈవెంట్ కు వచ్చినవారందరితో రాషా ఎంతో ప్రేమగా మాట్లాడింది. తమన్నా, విజయ్ లతో మాట్లాడుతూ.. తమ్ము బేబీని ఆంటీ అని నాలుక్కరుచుకుంది. ఆంటీ అన్నందుకు తమన్నా బాధపడకుండా.. రాషా భుజంపై చేయి వేసి.. పర్లేదు నువ్వు నన్ను ఆంటీ అనే పిలువు అని చెప్పుకొచ్చింది. ఆ తరువాత రాషా అలా పిలవకపోయినా.. ఆంటీ అను ఏమనుకొను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియోపై నెటిజన్స్ పలురకాలుగా స్పందిస్తున్నారు.. తమన్నాకు 35 .. రాషాకు 19. ఆంటీ అని పిలవడంలో తప్పు లేదులే అని చెప్పుకొస్తున్నారు. ఇక ఇంకొందరు మాత్రం ఈ వీడియోను హాట్ యాంకర్ అనసూయకు ట్యాగ్ చేస్తున్నారు. గతంలో ఆంటీ వివాదం ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనసూయను ఆంటీ అంటున్నారని, ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. తనను ఆంటీ అనొద్దు అని.. పేరు పెట్టి పిలవమని చెప్పుకొచ్చింది.
పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉంటే ఆంటీ అంటారా.. ? నా కొడుకు వయస్సు ఉన్న పిల్లలు ఆంటీ అని పిలిస్తే ఓకే కానీ.. అంతకన్నా పెద్దవారు ఎలా పిలుస్తారని ఆమె ఫైర్ అయ్యింది. అలా పిలిచినవారందరిపైనా ఆమె లీగల్ యాక్షన్ తీసుకోవాలని పోలీసులను కోరింది. అనసూయ వయస్సు 39. తమన్నా 35. ఆమె 19 ఏళ్ల అమ్మాయి ఆంటీ అంటే పర్లేదు అని చెప్తుంది. నువ్వు 39 లో ఉండి కూడా ఇంకా ఆంటీ అనొద్దు అంటున్నావ్.. చూడు.. తమన్నాను చూసి నేర్చుకో అని కామెంట్స్ పెడుతున్నారు.
Tammana Says Rasha Thadani "No Issues, CALL ME AUNTY"
– Great Gesture From Tammu 😳#TamannaahBhatia #RashaThadani #VijayVerma pic.twitter.com/Bemp5NdI01— Filmi Woman (@FilmiWoman) January 21, 2025