Actor Balaji: నటుడు బాలాజీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం టీవీ సీరియల్స్ తో బిజీగా ఉన్న బాలాజీ.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఇప్పటివరకు ఎవరికి తెలియని నిజాలను కూడా బయటపెట్టాడు. డబ్బింగ్ ఆర్టిస్ట్, నటి రోహిణి.. బాలాజీ సొంత చెల్లి. ఈ విషయం ఇప్పటివరకు చాలామందికి తెలియకపోవచ్చు.
బాలాజీ తండ్రికి నలుగురు పిల్లలు. బాలాజీ పెద్దవాడు. అతని తరువాత ఒక తమ్ముడు.. ఆ తరువాత రోహిణి.. ఆమె తరువాత ఒక తమ్ముడు ఉన్నారట. చిన్నతనం నుంచి తన తండ్రిలానే రోహిణిని పెంచి పెద్ద చేసినట్లు బాలాజీ చెప్పుకొచ్చాడు. చెల్లి అంటే తనకు మహా ఇష్టమని, ఆమె నటిగా మంచి పేరు తెచ్చుకున్నప్పుడు తానెంతో సంతోషించినట్లు తెలిపాడు.
ఇక తన నటన కోసం తండ్రి ఎంతో త్యాగం చేసాడని, ఆమె తరువాతనే తాను కూడా ఇండస్ట్రీలోకి వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. అప్పట్లో టి నగర్ లో జయమాలిని ఇంటి పక్కనే ఉండేవాడిని అని, ఆ తరువాత కొన్ని కారణాల వలన ఇలా అవ్వాల్సివచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇక చెల్లి రోహిణి ప్రేమకథను, విడాకుల విషయాన్నీ పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చాడు. రోహిణి.. నటుడు రఘువరన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. బాబు పుట్టాకా కొన్నేళ్ళకే విభేదాల వలన వారు విడిపోయారు.
చిన్న వయస్సులోనే రోహిణికి విడాకులు అవ్వడంపై బాలాజీ మాట్లాడుతూ.. ” రోహిణి చాలా స్ట్రాంగ్, మొండి. ఎవరిమాటా వినదు. నేను ఎవరినైనా కలపడానికే చూస్తాను. కలిసి ఉండాలనే చూస్తాను. దారం తెంపాలంటే ఈజీనే. దాన్ని అతికించడం బ్రహ్మ వలన కూడా కాదు. తెగేవరకు ఎందుకు తెచ్చుకోవాలి. తెగుతుంది అనుకున్నప్పుడు సామరస్యంగా కూర్చొని మాట్లాడుకోవాలి. అందుకే ఆడవాళ్లకు ఎక్కువ బాధ్యత, ఆప్యాయత, అనురాగాలు ఉంటాయి. వాళ్లే ఈ గొడవలను ఆలోచించి, మనది అనుకోని నిలబడాలి.
RGV: అహంకారంతో నా కళ్లు నెత్తికెక్కాయి.. ఇకనుంచి అలా చేయను.. ఎట్టకేలకు బుద్ది తెచ్చుకున్న వర్మ
డబ్బు ఎలా అయినా సంపాదించవచ్చు. ఒక మనిషిని నిలబెట్టడం.. ఒక మనిషితో నడవడం చాలా కష్టం. వారిద్దరి మధ్య చాలా గొడవలు అయ్యాయి. ఎవరిది తప్పు అని మనం చెప్పలేం. వారి గొడవలను సద్దుమణిగేలా చేసి నేను కలిపిన రోజులు ఉన్నాయి. ఇకనుంచి మేము గొడవపడమని తిరుపతి వెళ్లి గుండు కొట్టించుకున్న రోజులు ఉన్నాయి. కానీ, అలా అవ్వలేదు. రఘువరన్ చనిపోవడానికి కారణం ఓవర్ గా డ్రగ్స్ తీసుకోవడం అని అంటారు. ఆ విషయం నాకు తెలియదు కానీ, ఆయన చనిపోవడానికి కారణం అయితే ఆయన కొడుకు.
ఎవరికైనా ఏమనిపిస్తుంది. నా రక్తం నా దగ్గర లేనప్పుడు నేనెందుకు ఇంకా బ్రతికి ఉండడం. నా కొడుకు నా దగ్గర లేనప్పుడు నేను ఉన్నా లేనట్టే అని అనుకున్నాడు.. అలా డిప్రెషన్ లో డ్రగ్స్ కు అలవాటు పడి ఉండొచ్చు. ఆయన మంచి వ్యక్తి. మనుషులను త్వరగా నమ్మేస్తాడు. హాస్పిటల్ లో ఉన్నప్పుడు నేను వెళ్లి ఎందుకు ఇలా చేస్తున్నావ్ అంటే.. నువ్వేమైనా రజినీకాంత్ వా అని అడిగారు. కాదు నేను నీ బామర్దిని. బావ ఇలా అవుతుంటే తట్టుకోలేక అడిగాను అని చెప్పాను. అప్పటినుంచి ఆయన చనిపోయేవరకు నాతో మంచిగా మాట్లాడుతూ ఉండేవాడు. వారిద్దరి విడాకుల విషయంలో రఘువరన్ ది తప్పు ఉంది.. రోహిణి కూడా కొద్దిగా ఆలోచించి ఉంటే ఇప్పటికీ ఆయన బతికి ఉండేవాడు. ఆయన చివరి రోజుల్లో రోహిణి చాలా కష్టపడింది. అన్ని తానే అయ్యి చూసుకుంది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.