Vijay Varma – Tamannaah:మిల్క్ బ్యూటీ తమన్నా (Tamannaah).. ఈ పేరు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాతో పాటూ మెయిన్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. తమన్నా భాటియా ఎప్పుడైతే తన ప్రేమ విషయాన్ని బయట పెట్టిందో అప్పటినుండి తమన్నా పైనే మీడియా ఫోకస్ అంతా. తమన్నా తన బాయ్ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా మెయిన్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. అయితే గత ఏడాది తమన్నా సినిమాల కంటే ఎక్కువగా ఐటెం సాంగ్స్ ద్వారానే ఫేమస్ అయింది.
తమన్నా చేతిపై టాటూ..
అలా తమన్నా ‘అరుణ్మనై-4’ సినిమాలో నటించింది. అలాగే బాలీవుడ్ ‘స్త్రీ 2’ మూవీలో ఐటెం సాంగ్ చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘ఓదెల 2’ మూవీలో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా తమన్నా చేతి పైన టాటూ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన చాలామంది కథ ఎంతవరకు వెళ్లిందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే న్యూ ఇయర్ సందర్భంగా.. నటుడు విజయ్ వర్మ (Vijay Varma)తో కలిసి తమన్నా భాటియా వెకేషన్ కి వెళ్ళిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలు చూస్తే వీళ్ళిద్దరూ న్యూ ఇయర్ ని బాగా ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది. విజయ్ వర్మ తమన్నా భాటియా ఇద్దరూ సముద్రంలో షిప్ లో వెళ్తూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. అయితే వీటన్నింటిలో ఒక ఫోటో మాత్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.ఇక ఆ ఫోటో ఏంటంటే.. విజయ్ వర్మ పక్కనే కూర్చున్న వ్యక్తి చేతిపై విజయ్ అనే టాటూ ఉంది. అయితే కచ్చితంగా ఆ టాటూ ఉన్న చేయి తమన్నా భాటియాదేనని,విజయ్ వర్మ పేరు తమన్నా కాకుండా ఇంకెవరు టాటూగా వేయించుకుంటారు అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ టాటూ ఉన్న చేయి తమన్నదే అని అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే వీరిద్దరూ లవర్స్ కాబట్టి ఒకరి పేరు ఒకరు టాటూ వేయించుకోవడం కామన్. అలా ఫోటోలో కనిపించే చేయి తమన్నా భాటియాదేననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తల్లో ఉన్న నిజమెంతో కానీ ప్రస్తుతం ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
తమన్నా కెరియర్..
ఇక తమన్నా భాటియా ఓవైపు సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూనే మరోవైపు ఐటెం సాంగ్స్ కి కూడా ఓకే చెబుతోంది.ఇక నటుడు , విలన్ అయినటువంటి విజయ్ వర్మ కూడా వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ వర్మ నటించిన ‘ఉల్ జలుల్ ఇష్క్’ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఇక వీరిద్దరూ సినిమాల్లో యాక్టివ్ గా ఉన్నప్పటికీ అవకాశం దొరికినప్పుడల్లా వెకేషన్ లకి వెళ్తూ అక్కడి ఫోటోలు అభిమానులతో పంచుకుంటారు. ఇక ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన తమన్నా భాటియా ప్రస్తుతం రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే ఎలాంటి పాత్ర చేయడానికి అయినా రెడీగా ఉంటుంది. అలా తమన్నా హీరోయిన్ గా కాకుండా ఐటెం సాంగ్స్, కీ రోల్స్ లు కూడా చేస్తోంది.ఓవైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్ లు కూడా ఓకే చెబుతోంది.ఇక తమన్నా భాటియా లస్ట్ స్టోరీస్ -2 వెబ్ సిరీస్లో తన అద్భుతమైన నటనతో అందరిని మెప్పించింది.