BigTV English

Brahmaji: పిల్లల్ని వద్దనుకోవడం వెనుక బలమైన కారణం అదే.. మనసును కదిలించిన బ్రహ్మాజీ..!

Brahmaji: పిల్లల్ని వద్దనుకోవడం వెనుక బలమైన కారణం అదే.. మనసును కదిలించిన బ్రహ్మాజీ..!

Brahmaji:ప్రముఖ నటుడు బ్రహ్మాజీ (Brahmaji) అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. ఈయన ‘సింధూరం’ సినిమాతో స్టార్డం తెచ్చుకున్నారు. డైరక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi) ఫ్రెండ్స్ లిస్టులో బ్రహ్మాజీ కూడా ఉంటారు. అలా వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యంతోనే.. కృష్ణవంశీ తన డైరెక్షన్లో వచ్చిన సింధూరం(Sindhuram) సినిమాలో బ్రహ్మాజీకి హీరో రోల్ ఇచ్చారు. అయితే అలాంటి బ్రహ్మాజీ.. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొన్ని నెగటివ్ పాత్రలు చేసి, ప్రస్తుతం కామెడీ పాత్రలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక బ్రహ్మాజీ కామిడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఈయన కామెడీ పంచ్ లకు ప్రతి ఒక్కరు పగలబడి నవ్వాల్సిందే. బ్రహ్మాజీ కేవలం సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. కెరియర్ పరంగా ఎంతో సక్సెస్ చవిచూసిన బ్రహ్మాజీ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం.. అప్పటికే పెళ్లయి ఒక బాబు ఉన్న మహిళను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే బ్రహ్మాజీ పెళ్లయితే చేసుకున్నారు కానీ ఆమెతో పిల్లల్ని కనలేదు. మరి బ్రహ్మాజీ ఇప్పటి వరకు పిల్లల్ని కనకపోవడానికి కారణం ఏంటి? పెళ్లయి పిల్లలు ఉన్న మహిళని ఎందుకు పెళ్లి చేసుకున్నారు ?అనేది ఇప్పుడు చూద్దాం..


పెళ్లయి పిల్లలు ఉన్న మహిళతో బ్రహ్మాజీ పెళ్లి..

హీరో హీరోయిన్ల విషయంలో పెళ్లయిన వారిని పిల్లలు ఉన్న వారిని పెళ్లి చేసుకోవడం చాలా కామన్.అలా నటుడు బ్రహ్మాజీ (Brahmaji)కూడా పెళ్లయి ఒక కొడుకున్న బెంగాలీ మహిళను ప్రేమించి పెళ్లాడారు. అయితే వీరి పరిచయం చెన్నైలో జరిగిందట. షూటింగ్ కోసం చెన్నై వెళ్ళిన బ్రహ్మాజీకి పెళ్లయి విడాకులు తీసుకున్న శాశ్వతీ (Sasvati) తో పరిచయం ఏర్పడింది. ఆమెకు పెళ్లయి బాబు ఉన్నాడని తెలిసాక కూడా.. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అలా బెంగాలీ మహిళను పెళ్లి చేసుకున్న బ్రహ్మాజీ, ఇప్పటి వరకు పిల్లల్ని కనలేదు. ప్రస్తుతం 60 ఏళ్ల ఏజ్ కి దగ్గరలో ఉన్న బ్రహ్మాజీ (Brahmaji) పిల్లల్ని ఎందుకు కనలేదు అనే ప్రశ్న ఎదురైన ప్రతిసారీ ఒక్కటే ఆన్సర్ చెబుతారు. అదేంటంటే.. నేను శాశ్వతీని పెళ్లి చేసుకునే కంటే ముందు ఆమెకు పెళ్ళై ఒక బాబు ఉన్నాడు. ఇక నాతో పెళ్లయ్యాక మళ్లీ ఆమెతో పిల్లల్ని కనడం నాకు ఇష్టం లేదు. అయితే ఆదర్శ వంతున్ని అని మాత్రం కాదు.కానీ ఒకవేళ మాకు పిల్లలు పుడితే ఎక్కడ నాలో సెల్ఫిష్ నెస్ పెరిగిపోతుందేమోనని భయం. ఒకవేళ నాకు పిల్లలు పుడితే వీడు నా కొడుకు అనే సెల్ఫిష్ నెస్ పెరుగుతుంది.


అందుకే పిల్లల్ని కనలేదు అంటూ క్లారిటీ ఇచ్చిన బ్రహ్మాజీ..

అందుకే ఇవన్నీ మనకెందుకు అని ఆలోచించి పిల్లల్ని కనలేదు అంటూ బ్రహ్మాజీ (Brahmaji) షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. ఇక బ్రహ్మాజీ మాత్రమే రాజమౌళి(Rajamouli) కూడా రమా రాజమౌళికి వేరే భర్తతో పుట్టిన కొడుకు ఉండడంతో మళ్లీ పిల్లల్ని కనలేదు. ప్రస్తుతం బ్రహ్మాజీ కొడుకు కృష్ణవంశీ (Krishna Vamsi) దగ్గర పనిచేస్తున్నాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే తన భార్య ఒక ఇంటీరియర్ డిజైనర్ అని ,తనకు సినిమాలు లేక ఇంట్లో ఉన్న సమయంలో తన భార్యే తనని పోషించింది అంటూ బ్రహ్మాజీ (Brahmaji) చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా పిల్లల్ని కనకపోవడం వెనుక అసలు కారణాన్ని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు బ్రహ్మాజీ.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×