BigTV English

Tantra: ఓటిటీలోకి వచ్చేస్తున్న మరో హర్రర్ సినిమా..

Tantra: ఓటిటీలోకి వచ్చేస్తున్న మరో హర్రర్ సినిమా..


Tantra: మల్లేశం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ అనన్య నాగళ్ల. అచ్చ తెలుగు అమ్మాయిగా తెలుగు ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే విమర్శల ప్రశంసలను అందుకుంది. ఇక ఆ తరువాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో నటించి మెప్పించింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనన్య.. ఈ నెల తంత్ర అనే హర్రర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సలోని, టెంపర్ వంశీ కీలక పాత్రల్లో నటించారు. మార్చి 15 న రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఇక దాదాపు మూడు వారాల తరువాత ఓటిటీ బాట పట్టడానికి సిద్దమయ్యింది.

ఇక ఈ మధ్య చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తున్న ఆహా.. ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. తాజాగా తంత్ర ఏప్రిల్ 5 న ఆహాలోకి రానుందని మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. తంత్రం మంత్రం కుతంత్రం.. ఆహా అందిస్తోన్న మరో హారర్ చిత్రం.. తంత్ర ఏప్రిల్ 5 నుంచి డిజిటల్ ప్రీమియర్ కానుంది.అంతేకాకుండా ఓటిటీ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. మొదటినుంచి కూడా ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. చేతబడి, క్షుద్రపూజల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ లో పెద్ద సినిమాల కారణంగా వెనక్కి పడిపోయిందని తెల్సిందే. ఇక ఈ సినిమా కోసం హర్రర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ చిత్రం ఏప్రిల్ 5 న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఓటిటీలో.. థియేటర్ లో హిట్ అయిన సినిమాల కంటే.. ఇలాంటి సినిమాలే మంచి ఆదరణకు నోచుకుంటున్నాయి.


ఇక తంత్ర కథ విషయానికొస్తే.. రేఖ (అనన్య నాగళ్ల), తేజు (ధనుష్ రఘుముద్రి) ఇద్దరూ ప్రేమించుకుంటారు. రేఖ తల్లి రాజ్యలక్ష్మీ(సలోని) చిన్నతనంలోనే చనిపోవడంతో నాన్నమ్మనే ఆమెను పెంచి పెద్దచేస్తుంది. ఇక తేజును పెళ్లి చేసుకోవడానికి రేఖకు ఒక సమస్య అడ్డం వస్తుంది. అదే తేజు ఒక వేశ్య కొడుకు కావడం. ఊర్లో అందరికీ తేజు వేశ్య కొడుకు అని తెలియడంతో రేఖ ప్రేమను ఎవరూ అంగీకరించారు. ఇక రేఖ క్షుద్ర శ‌క్తుల కార‌ణంగా జ‌న్మించ‌డంతో ఆమె చుట్టూ దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి. ఆమెకే దెయ్యాలు కనిపిస్తూ ఉంటాయి. పౌర్ణ‌మి వ‌చ్చిందంటే చాలు.. ఒక రక్త పిశాచి రేఖను పట్టుకొని పీడిస్తూ ఉంటుంది. ఇంకోపక్క విగతి(టెంపర్ వంశీ) రేఖను బాలి ఇవ్వడానికి విశ్వప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అసలు రేఖ ఎవరు.. ? ఆమె తల్లికి ఏమైంది.. ? ఎందుకు ఆమె చుట్టూనే దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి.. ? విగతి ఎందుకు రేఖను బలి ఇవ్వాలనుకుంటాడు..? చివరికి రేఖ, తేజు ఒక్కటి అయ్యారా.. ? అనేది తంత్ర కథ. మరి థియేటర్ లో మిస్ అయ్యినవారు ఈ హర్రర్ సినిమాను ఓటిటీలో చూసి ఎంజాయ్ చేయండి.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×