E-Paper
Advertisement

 Tantra teaser : మంత్ర తంత్రాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న తంత్ర టీజర్..

 Tantra teaser : మంత్ర తంత్రాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న తంత్ర టీజర్..
Advertisement
 Tantra teaser

 Tantra teaser : ప్లే బ్యాక్, వకీల్ సాబ్, మల్లేశం మొదలైన చిత్రాలలో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ అనన్య నాగళ్ల. ఇప్పుడు తంత్ర అనే మూవీతో ప్రేక్షకులను భయపెట్టడానికి రాబోతోంది. ఈ మూవీకి సంబంధించిన టీజర్ ఈరోజు ప్రియదర్శి చేతుల మీద రిలీజ్ అయింది.

మంత్ర తంత్రాలు ,పిశాచులు ,మంత్రగాళ్లు ,క్షుద్ర పూజలు ,చేతబడులు.. ప్రస్తుతం ఇలా ఉన్న హారర్ థ్రిల్లర్ మూవీలకు ఆదరణ ఎక్కువగా ఉంది. ఒకపక్క భయపడుతూనే ఇంకోపక్క నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఆత్రుతగా ఇటువంటి సినిమాలను చూస్తున్నారు ప్రేక్షకులు.

Advertisement

ఇక ఈరోజు విడుదలైన తంత్ర టీజర్ విషయానికి వస్తే.. ఊరిలో పుట్టిన ఒక దుష్ట శక్తి.. రక్త దాహంతో విరుచుకుపడుతోంది.. అంటూ వెన్నులో వణుకు పుట్టే విధంగా ట్రైలర్ ని మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత ట్రైలర్లో కనిపించిన రకరకాల తాంత్రిక పూజలు ,పద్ధతులు చూస్తే ఓ మంచి హారర్ థ్రిల్లర్ మూవీ చూడబోతున్నామని అర్థమవుతుంది. ఇక ఇందులో అనన్య.. దుష్టశక్తి చేతిలో చిక్కిన అమ్మాయి పాత్రలు చాలా కొత్తగా ..మునిపెన్నడూ చూడని విధంగా కనిపిస్తుంది. టీజర్ ని బట్టి చూస్తే.. ఈ మూవీలో మనకు తెలియని ఎన్నో పురాతన తాంత్రిక రహస్యాలను వెలికి తీసి మరి తెరకెక్కించారని తెలుస్తుంది.

 ఈ మూవీలో హీరోగా.. శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్  రఘుముద్రి సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. టెంపర్ వంశి ఇందులో క్షుద్ర పూజలు చేసే మాంత్రికుడిగా ఓ రేంజ్ లో భయం పుట్టించే అవతారంలో కనిపిస్తున్నాడు. మర్యాద రామన్న లాంటి చిత్రాలలో నటించిన హీరోయిన్ సలోని ఈ మూవీతో తిరిగి రీఎంట్రీ ఇస్తోంది. అయితే ప్రస్తుతానికి చిత్రంలో ఆమె పాత్ర పై సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న హారర్ ట్రెండ్ కు తగినట్టుగానే.. తంత్ర మూవీ ట్రైలర్ అధ్యంతం ఆకట్టుకుంటుంది. క్షుద్ర పూజలు నేపథ్యంలో ఇప్పటివరకు వచ్చిన ఎన్నో చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.. ఈ నేపథ్యంలో ఈ మూవీ కూడా మంచి సక్సెస్ సాధిస్తుందని చిత్ర బృందం ఆశిస్తున్నారు. టీజర్ మంచి ఇంప్రెస్సింగ్ గా ఉంది.. దీంతో మూవీ పై అంచనాలు కూడా ఓ రేంజ్ లో నెలకొన్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×