BigTV English

Eluru Mayor Noorjahan: టీడీపీలోకి మరో ఇద్దరు కీలక నేతలు.. ముహూర్తం ఖరారు!

Eluru Mayor Noorjahan: టీడీపీలోకి మరో ఇద్దరు కీలక నేతలు.. ముహూర్తం ఖరారు!

Eluru Mayor Noorjahan Jion to TDP: వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనుంది. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం ప్రభావంతో ఆ పార్టీకి వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలు ఆ పార్టికి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా, ఏలూరు నగర మేయర్ నూర్జహాన్, ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి వచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.


ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో ఈనెల 27న ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్ సమక్షంలో చేరుందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. వీరితో పాటు ఏలూరు నగరానికి చెందిన మరో 39 మంది కీలక నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే అందరితో ఎమ్మెల్యే సంప్రదింపులు చేశారు. అయితే మేయర్‌తో పాటు చేరుతారా? తర్వాత చేరుతారా? అనే విషయం తెలియాల్సి ఉంది.

మేయర్ నూర్జహాన్, పెదబాబుల రాజకీయ జీవితం టీడీపీతోనే మొదలైంది. 2013లో టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బడేటి బుజ్జి సమక్షంలో వీరు టీడీపీలోకి వచ్చారు. నగర పాలక సంస్థ ఎన్నికల సమయంలో నూర్జహాన్‌ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో నూర్జహాన్ విజయం సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. తర్వాత జరిగిన పరిణామాల్లో 2019 ఎన్నికల సమయంలో వీరిద్దరూ వైసీపీలోకి వెళ్లారు. దీంతో మరోసారి మేయర్ పదవి వరించింది.


Also Read: బ్రేకింగ్ న్యూస్.. ఇటీవలే ట్రైనింగ్ పూర్తి చేసిన ఐఏఎస్ ఆఫీసర్లకు పోస్టింగ్స్

ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించడంతో సొంతగూటికి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మేయర్ టీడీపీలో చేరితే ఏలూరు నగర పాలక సంస్థ టీడీపీ కైవసం చేసుకుంటుందని అందరూ భావిస్తున్నారు. ఈ మేరకు మేయర్ భర్త ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమర్థత కలిగిన నాయకులన్నారు. ఎమ్మెల్యే చంటి ఆధ్వర్యంలో నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×