G2 Update : యంగ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటిస్తున్న కొత్త మూవీ ‘గూడచారి 2’ (G2). అడివి శేష్ (Adivi Sesh) కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ని షేర్ చేసుకున్నారు మేకర్స్.
హీరోయిన్ కు వెల్కమ్
అడివి శేష్ (Adivi Sesh) హీరోగా, బాలీవుడ్ హీరోయిన్ వామికా గబ్బి (Wamiqa Gabbi) హీరోయిన్ గా నటిస్తున్న స్టైలిష్ స్పై థ్రిల్లర్ ‘గూడచారి 2’. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగం షూటింగ్ యూఎస్ఏ లో జరిగింది. ఇంకా షూటింగ్ దశలో లో ఉన్న ‘గూడచారి 2’ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించబోతున్నారు. అయితే తాజాగా చిత్ర బృందం వామికా గబ్బికి సెట్స్ లోకి ఆహ్వానం పలికింది ‘జీ2’ టీం. ఈ మేరకు “వెల్కమ్ టు అవర్ మిషన్ వామిక… ఏజెంట్ 116” అంటూ హీరోయిన్ ని పరిచయం చేశారు. ఇక ఈ పోస్టర్లో హీరో హీరోయిన్ల లుక్ చూస్తుంటే బాలీవుడ్ స్పై థ్రిల్లర్ సినిమాలు గుర్తురాక మానవు. మొత్తానికి ఈ పోస్టర్ ద్వారా సినిమాపై మేకర్స్ మరోసారి ఆసక్తిని పెంచేశారు. కాగా వామికాకు ఇదే తొలి తెలుగు సినిమా.
మరోవైపు ‘డెకాయిట్’
ఇదిలా ఉండగా అడివి శేష్ (Adivi Sesh) ప్రస్తుతం ‘జీ 2’ (G2) సినిమాతో పాటు ‘డెకాయిట్’ (Dacoit) అనే మరో భారీ పాన్ ఇండియా సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా. షానిల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. అడవి శేషు ఒకేసారి ‘జీ2’తో పాటు ‘డెకాయిట్’ సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలను ఈ ఏడాది రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ముందుగా ‘డెకాయిట్’ సినిమాలో శృతిహాసన్ ను హీరోయిన్ గా అనుకున్నారు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ తో పాటు ఒక గ్లిమ్స్ ని కూడా రిలీజ్ చేశారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా నుంచి శృతి హాసన్ తప్పుకుంది అనే రూమర్లు వినిపించాయి. ఆ రూమర్లను నిజం చేస్తూ, రీసెంట్ గా ‘డెకాయిట్’ టీమ్ నుంచి మరో పోస్టర్ వచ్చింది. ఆ పోస్టర్లో శృతిహాసన్ బదులు మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా కనిపించి సర్ప్రైజ్ చేసింది. దీంతో ఈ ప్రాజెక్టు పై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక అడివి శేష్ నుంచి రాబోతున్న ఈ రెండు క్రేజీ థ్రిల్లర్ సినిమాల గురించి ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.