Yuvraj Singh on Rohit Virat: ఈ నెలాఖరులో సొంత గడ్డపై ఇంగ్లాండ్ తో పరిమిత ఓవర్ల సిరీస్, ఆ తరువాత ఛాంపియన్స్ ట్రోఫీ – 2025 కి ముందు సీనియర్లు, కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫామ్ లో లేకపోవడం భారత జట్టుకు అతిపెద్ద సమస్యగా మారింది. న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ లో ఘోర పరాభవం తర్వాత ఈ ఇద్దరిపై పలువురు మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
Also Read: Harbhajan Singh: నువ్వు వచ్చి.. టీమిండియాను నాశనం చేశావ్ ? గంభీర్ పై భజ్జీ సీరియస్ !
ఈ ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించాలని.. దేశవాళీల్లో ఆడక పోవడం వల్లే ఈ పరిస్థితి అని, వీరికి అదనపు ప్రయోజనాలు కట్ చేయాలని అలాగే కెప్టెన్ ని మార్చాలని కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారత మాజీ ప్లేయర్, దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తన కుటుంబం అని ఈ మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ పేర్కొన్నారు. తన ఫ్యామిలీకి మద్దతుగా నిలవడం తన బాధ్యత అని అన్నారు యువరాజ్.
వారు కచ్చితంగా గట్టి కమ్ బ్యాక్ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంతటి ఆటగాడికైనా కొన్నిసార్లు పరాభవం తప్పదని.. అంతమాత్రాన రోహిత్, కోహ్లీని తిట్టడానికి మీరెవరని ఆయన సీరియస్ అయ్యారు. వచ్చే నెల ఇంగ్లాండ్ తో జరగనున్న వన్డే సిరీస్ లో రాణించేందుకు ఈ ఇద్దరు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ” గత ఐదారేళ్లలో భారత్ సాధించిన విజయాలు అద్భుతం. నాకు తెలిసినంతవరకు ఏ ఇతర జట్టు కూడా ఇలా చేయలేదు. కేవలం ఒక్క ఓటమితో మన గొప్ప ఆటగాళ్ల గురించి చెడుగా మాట్లాడుతున్నాం. రోహిత్, కోహ్లీ గతంలో జట్టు కోసం ఎంతో చేశారు.
వాటన్నింటినీ ఇప్పుడు ప్రజలు మరిచిపోయారు. వీరిద్దరూ దేశం కోసం ఏం చేయడానికైనా వెనకాడరు. కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్ అజిత్ అగర్కర్, కీలక ఆటగాళ్లు రోహిత్, కోహ్లీ, బుమ్రా ఉన్న భారత జట్టు కమ్ బ్యాక్ సాలిడ్ గా ఉంటుంది. చివరి టెస్ట్ కి కెప్టెన్ గా రోహిత్ శర్మ ఫామ్ లేక తప్పుకోవడం నిజంగా గ్రేట్. రోహిత్ కెప్టెన్సీ లోనే వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కి వెళ్ళాం. టి20 ప్రపంచ కప్ గెలుపొందాము. ఒక సిరీస్ ఓడిపోయినంత మాత్రాన పోయేదేం లేదు. ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేయనప్పుడు విమర్శించడం చాలా ఈజీ. కానీ వారికి మద్దతుగా నిలవడం కష్టం.
నేను మాత్రం నా మిత్రులకు ఎప్పుడు సపోర్ట్ గానే మాట్లాడుతా” అన్నారు యువరాజ్ సింగ్. మరోవైపు రోహిత్, కోహ్లీ ఆట తీరుపై యువరాజ్ తండ్రి యోగరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇలా విఫలం అవుతుంటే కోచ్ గౌతమ్ గంభీర్ ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. ఆటగాళ్లు వైఫల్యాల బారిన పడ్డప్పుడు వారు చేస్తున్న మిస్టేక్స్ ని సరిదిద్దాలని టీమ్ మేనేజ్మెంట్ తో పాటు కోచ్ గౌతమ్ గంభీర్ కి సూచించారు.
Also Read: Temba Bavuma: ఉన్నది 3 ఫీట్లే.. కానీ పాకిస్థాన్ ను వణికించాడు.. చరిత్ర సృష్టించాడు!
ఇక సీనియర్లు, జూనియర్లతో కూడిన జట్టును ముందుకు తీసుకెళ్లే సత్తా గంభీర్ లో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రోహిత్, కోహ్లీకి 2024 సంవత్సరం అస్సలు కలిసి రాలేదని చెప్పొచ్చు. 2023లో అదరగొట్టిన రోహిత్.. 2024లో మాత్రం రాణించలేకపోయాడు. 2024లో 14 టెస్టులు ఆడిన రోహిత్ కేవలం 619 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 3 వన్డే మ్యాచ్ లలో 157 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు. ఇక విరాట్ కోహ్లీ 10 టెస్టుల్లో 417 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరి ఉన్నాయి. అలాగే 3 వన్డేల్లో 58 పరుగులు చేశాడు.
VIDEO | Here’s what former India cricketer Yuvraj Singh (@YUVSTRONG12) said backing Virat Kohli, Rohit Sharma amidst the criticism over Team India’s defeat in the Border-Gavaskar Trophy.
“I look at what India has achieved in the last five-six years. They have achieved two… pic.twitter.com/pghTYHtdB1
— Press Trust of India (@PTI_News) January 7, 2025