BigTV English
Advertisement

SDT18: మెగా మేనల్లుడికి ధీటైన విలన్నే పట్టారే.. ముచ్చటగా మూడోసారి..

SDT18: మెగా మేనల్లుడికి ధీటైన విలన్నే పట్టారే.. ముచ్చటగా మూడోసారి..

SDT18: విరూపాక్ష తరువాత  మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. మంచి విజయాన్ని అందుకున్నాడు. చేతబడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తేజ్ కెరీర్ లోనే  బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత తేజ్.. దానికిమించిన కథతో రావాలని ఎంతో ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ మెగా మేనల్లుడు గాంజా శంకర్ అంటూ ఒక సినిమాను ప్రకటించాడు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లిన కొన్నిరోజులకే ఆగిపోయిందని సమాచారం. సంపత్ నంది కూడా ఈ సినిమాను పట్టించుకోకుండా ఇంకో సినిమా మీద ఫోకస్ పెడుతున్నాడు.


ఇక తేజ్ సైతం దాని గురించి పట్టించుకోకుండా మరోసినిమాను పట్టాలెక్కించాడు. అదే SDT18. రోహిత్‌ కేపీ అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా నిర్మాతలుగా మారిన  కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి..  ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Bhairavam: గరుడన్ రీమేక్.. ఊర మాస్ లుక్ లో బెల్లంకొండ హీరో.. శివ తాండవమే


1947 హిస్ట‌రీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం నడుస్తుందని, ఈ సినిమాకు సంబరాల ఏటిగట్టు అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రంలోకి విలక్షణ నటుడును రంగంలోకి దించారు మేకర్స్. ఒకప్పటి ఫ్యామిలీ స్టార్ హీరో జగపతి బాబు.. ప్రస్తుతం  సపోర్టివ్ రోల్స్ లో, విలన్ రోల్స్ లో అదరగొడుతున్న విషయం తెల్సిందే. బాషాతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో తనసత్తా చూపుతున్న జగపతి బాబు ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. జగపతి బాబు పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేస్తూ.. ఆయనను సినిమాలోకి సాదరంగా  ఆహ్వానించారు.

Anushka : స్వీటీ బర్త్ డే సర్ప్రైజ్ లోడింగ్… ఈసారి డబుల్ ధమాకా

ఇక మాస్ లుక్ లో జగ్గు భాయ్ అదిరిపోయాడు. గుబురు గడ్డం.. సీరియస్ లుక్ లో.. తేజ్ కు అసలు సిసలైన విలన్ గా కనిపిస్తున్నాడు. తేజ్ – జగ్గు భాయ్ ఇప్పటికే రెండు సినిమాల్లో నటించిన విషయం తెల్సిందే. తేజ్ మొదటి సినిమా పిల్లా.. నువ్వు లేని జీవితం సినిమాలో తేజ్ కు విలన్ గా జగ్గూభాయ్ కనిపించాడు.

ఇక ఆ తరువాత విన్నర్ సినిమాలో తేజ్ కు తండ్రిగా జగ్గూభాయ్ కనిపించాడు. ఈ రెండు సినిమాల తరువాత ఇప్పుడు SDT18లో ఈ కాంబో రీపీట్ కానుంది. త్వరలోనే ఈ సినిమా సెట్ లో జగ్గూభాయ్ అడుగుపెట్టనున్నాడు. మరి  ఈ సినిమాతో ఈ కాంబో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×