BigTV English

Thammudu Movie: నితిన్ ‘తమ్ముడు’ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాదే రెండు సినిమాలు

Thammudu Movie: నితిన్ ‘తమ్ముడు’ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాదే రెండు సినిమాలు

Nithiin Thammudu Movie: ఒక్క హిట్ వస్తే బాగుంటుంది అని ఎదురుచూస్తున్న యంగ్ హీరోలు ఎంతోమంది ఉన్నారు. అందులో నితిన్ కూడా ఒకడు. నితిన్‌కు ఒక్క సినిమా హిట్ అయ్యి ఫార్మ్‌లోకి వచ్చాడు అనుకునేలోపే వెంటనే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఎదురవుతున్నాయి. దీంతో మళ్లీ మొదటినుండి మొదలుపెట్టాల్సి వస్తుంది. అందుకే ఈసారి రెండు సినిమాలను ఒకేసారి లైన్‌లో పెట్టి ఏదో ఒక మూవీతో హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు నితిన్ (Nithiin). అసలైతే అందులో ఒక మూవీ డిసెంబర్‌లో విడుదల కావాల్సింది కానీ పలు కారణాల వల్ల వాయిదా పడింది. మరొక సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ అప్డేట్ తాజాగా బయటికొచ్చింది.


కొత్త పోస్టర్ విడుదల

ప్రస్తుతం నితిన్ చేతిలో ‘రాబిన్‌హుడ్’, ‘తమ్ముడు’ (Thammudu) చిత్రాలు ఉన్నాయి. అందులో ముందుగా ‘రాబిన్‌హుడ్’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అంతే కాకుండా ఈ షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్స్‌ను కూడా ఎప్పటికప్పుడు రివీల్ చేస్తున్నారు మేకర్స్. కానీ ‘తమ్ముడు’ సినిమాపైనే ఇంకా పూర్తిస్థాయిలో క్లారిటీ లేదు. ఇక తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి చెప్తూ దానిపై కూడా ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చేశారు. శ్రీ రామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తమ్ముడు’ సినిమా షూటింగ్ ఇంకా చాలానే పెండింగ్ ఉండడంతో ఈ మూవీ ఏడాది విడుదలయ్యే ఛాన్స్ లేదని మేకర్స్ స్పష్టం చేశారు. అంతే కాకుండా ఒక కొత్త పోస్టర్ విడుదల చేసి రిలీజ్ డేట్ గురించి ప్రకటించారు.


Also Read: అనుష్క బర్త్‌ డేకు స్పెషల్ సర్‌ప్రైజ్ రెడీ.. ‘ఘాటీ’ నుండి కీలక అప్డేట్

ఒక ఏడాది గ్యాప్

‘తమ్ముడు’ మూవీ నుండి తాజాగా ఒక కొత్త పోస్టర్ విడుదలయ్యింది. అందులో నితిన్.. ఒక పాపను తన భుజాన ఎక్కించుకొని పరిగెడుతూ కనిపించాడు. దాంతో పాటు తన వెంట చాలామంది పడుతున్నట్టు కూడా చూపించారు. ఇక ఈ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌తో పాటు ‘తమ్ముడు’ సినిమా రిలీజ్ డేట్‌ను జతచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ‘తమ్ముడు’.. 2025 మహాశివరాత్రికి విడుదల అవుతుందని ఆ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది మూవీ టీమ్. దీంతో ఈ ఏడాది గ్యాప్ వచ్చినా కూడా వచ్చే ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నితిన్ తమను ఎంటర్‌టైన్ చేస్తాడని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ‘రాబిన్‌హుడ్’ కూడా ఎక్కువశాతం వచ్చే సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

విలేజ్ డ్రామా

నితిన్ హీరోగా నటిస్తున్న ‘తమ్ముడు’ సినిమాను శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు దీనిని నిర్మించడానికి ముందుకొచ్చారు. ఈ సినిమాలో నటీనటుల గురించి ఇంకా పూర్తిస్థాయిలో క్లారిటీ లేదు. ఇప్పటికీ ఈ మూవీ నుండి కేవలం ఒక పోస్టర్ మాత్రమే విడుదలయ్యింది. అందులో నితిన్.. బస్సులో ఎక్కడికో వెళ్తున్నట్టుగా చూపించారు. ఇప్పటివరకు విడుదలయిన రెండు పోస్టర్స్ చూస్తుంటే ఇదొక పూర్తిస్థాయి విలేజ్ డ్రామా అని అర్థమవుతోంది. అంతే కాకుండా ‘తమ్ముడు’ను కమర్షియల్ సినిమాగా ప్లాన్ చేస్తున్నట్టున్నాడు దర్శకుడు శ్రీరామ్ వేణు. ఇక ఇందులో నితిన్‌కు అక్కగా సీనియర్ హీరోయిన్ లయ కనిపించనుంది.

Thammudu Movie Poster
Thammudu Movie Poster

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×