BigTV English

Chiranjeevi- Venkatesh: ఎక్స్ కాప్ తో విశ్వంభర.. పిక్ ఆఫ్ ది డే అంటే ఇదేరా

Chiranjeevi- Venkatesh: ఎక్స్ కాప్ తో విశ్వంభర.. పిక్ ఆఫ్ ది డే అంటే ఇదేరా

Chiranjeevi- Venkatesh: ఒక హీరో సెట్ లో కనిపిస్తేనే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. అదే ఇద్దరు హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే.. సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే. తాజాగా  టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఒకే ఫ్రేమ్  లో కనిపించి సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.


చిరంజీవి.. విశ్వంభర సినిమాతో  బిజీగా మారగా..  వెంకీ  మామ.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో ఎక్స్ కాప్ గా వెంకీ మామ కనిపించనున్నాడు.  ప్రస్తుతం ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.

ఇక తాజాగా విశ్వంభర సెట్ లో వెంకీ అనిల్ 3 టీమ్ సందడి చేశారు. పక్కపక్కనే షూటింగ్  జరుగుతుండగా.. వెంకీ మామ తన చిత్ర బృందంతో కలిసి వెళ్లి చిరంజీవిని కలిశాడు. ఇందుకు సంబంధించిన  ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు  పిక్ ఆఫ్ ది డే అంటే ఇదేరా అని కామెంట్స్  పెడుతున్నారు. ఇక చిరు.. వెంకీ మామ హీరోయిన్స్ అయిన  మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేష్ తో కలిసి ఫోటోలు దిగారు.


వెంకీ- చిరుల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ ఎప్పుడు కలిసినా ఫ్యాన్స్ కు సందడే  సందడి. చిరు జోకులు .. వెంకీ మామ సెటైర్లతో ఫుల్ ఫన్ ఉంటుంది. వీరిద్దరి ఫ్రేమ్  మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.  బ్లాక్ కలర్ షర్ట్ లో చిరు కనిపించగా.. గళ్ళ చొక్కా, కళ్లజోడుతో వెంకీ మామ చాలా  సింపుల్ గా కనిపించాడు. వీరిద్దరిని ఒక ఫ్రేమ్ లో చూసిన అభిమానులు.. మల్టీస్టారర్  చేయమని కామెంట్స్ పెడుతున్నారు.

వెంకీకి ఇలాంటి మల్టీస్టారర్స్  కొత్తేమి కాదు. మంచి కథ దొరకాలే కానీ..  చిరు కూడా ఇందుకు ఒప్పుకుంటాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ సీనియర్ హీరోలు ఈ సినిమాలతో ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×