BigTV English

Jimmy Tata: అన్న అలా.. తమ్ముడు ఇలా.. అజ్ఞాతవాసి జిమ్మీ టాటా గురించి మీకు తెలుసా?

Jimmy Tata:  అన్న అలా.. తమ్ముడు ఇలా.. అజ్ఞాతవాసి జిమ్మీ టాటా గురించి మీకు తెలుసా?

Jimmy Tata Lifestyle: రతన్ టాటా.. ప్రపంచానికి ఆయన గురించి పరిచయం అవసరం లేదు. లక్షల కోట్ల ఆస్తులు, వేల కోట్ల సేవా కార్యక్రమాలు, విలువలతో కూడిన వ్యాపారాలు. క్రమశిక్షణతో కూడిన భారతీయతకు  నిలువెత్తు నిదర్శనం. విశ్వసనీయతకు మారుపేరు. ఆయన గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నిత్యం పతాక శీర్షికల్లో ఉంటారు రతన్ టాటా. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి రతన్ టాటాకు పూర్తి భిన్నంగా కనిపిస్తారు. ఆయనా టాటా వారసుడే అయినా, ఏనాడూ బయట కనిపించరు. తను మరెవరో కాదు, జిమ్మీ నావల్ టాటా. రతన్ టాటాకు స్వయానాతమ్ముడు. రతన్ టాటాకు తమ్ముడు ఉన్నారనే విషయే చాలా మందికి తెలియదు. టాటా కంపెనీలోని కీలక వ్యక్తులకు కూడా ఆయన తెలియదు. ఇప్పటికీ తాము ఆయనను చూడలేదనే చెప్తుంటారు.


డబుల్ బెడ్రూం ఇంట్లో నివాసం, నో సెల్ ఫోన్

భారత్ లోని అత్యంత సంపన్న కుటుంబాల్లో మొదటి స్థానంలో ఉంటుంది టాటా ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీలో పుట్టిన జిమ్మీ టాటా అత్యంత నిరాడంబర జీవితాన్ని గడుపుతారు. అన్న మాదిరిగానే ఆయన కూడా పెళ్లి చేసుకోలేదు. ముంబైలోని కొలాబా ప్రాంతంలో డబుల్ బెడ్రూం ప్లాట్ లో ఉంటారు. ఇంట్లో ఒంటరిగా ఉంటారు. ఎప్పుడూ తలుపులు మూసే ఉంటాయి. రేర్ గా బయటకు వస్తుంటారు. స్మార్ట్ యుగంలోనూ ఆయనకు కనీసం ఫోన్ లేదు. అలాగని ఆయనకు ఏం తెలియదు అనుకోకూడదు. తన వ్యాపార సామ్రాజ్యంలో జరిగే ప్రతి విషయం ఆయనకు తెలిసిపోతుంది. నిత్యం బిజినెస్ మ్యాగజైన్లు, న్యూస్ పేపర్లు చదువుతారు. రతన్ టాటా మరణం తర్వాత చాలా మంది జిమ్మీ టాటా గురించి ఆరా తీస్తున్నారు. టాటా సన్స్ చైర్మెన్ గా సైరస్ మిస్త్రీ బాధ్యతలు చేపట్టడం, ఆ తర్వాత ఆయను తొలగించి మళ్లీ రతన్ టాటా బాధ్యతలు తీసుకోవడం అప్పట్లో సంచలనం కలిగించింది. ఆ సమయంలోనే ఓ ఆంగ్ల పత్రిక జిమ్మీ టాటా గురించి కీలక వివరాలు వెల్లడించింది. అప్పటి వరకు రతన్ టాటాకు తమ్ముడు ఉన్నారనే విషయం ఎవరికీ తెలియదు.


కీలక టాటా సంస్థల్లో కోట్ల విలువైన షేర్లు   

జిమ్మీ టాటా బయటి ప్రపంచానికి తెలియకపోయినా, సంపద విషయంలో ఆయనకు తిరుగులేదు. టీసీఎస్, టాటా మోటార్స్, టాటా స్టీల్స్, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్, టాటా పవర్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఆయనకు షేర్లు ఉన్నాయి. టాటా ఫౌండేషన్ ట్రస్టీగానూ కొనసాగుతున్నారు. అలాంటి వ్యక్తి అంత లో ప్రొఫైల్ ఎందుకు మెయింటెయిన్ చేస్తున్నారనేది ఎవరికీ తెలియని విషయం. ఆయనకు పెద్దగా ఫ్రెండ్స్ కూడా లేరు. స్క్వాష్ గేమ్ అంటే ఆయనకు చాలా ఇష్టం. రతన్ టాటా, జిమ్మీ టాటా అన్నదమ్ములు అయినప్పటికీ ఇద్దరి జీవిత శైలి పరస్పర విరుద్ధంగా ఉంటుంది. ఒకరేమో హై ప్రొఫైల్, మరొకరు లో ప్రొఫైల్. అలా ఉండటమే తనకు చాలా ఇష్టం అంటారట జిమ్మీ టాటా.

Read Also:నీ వెంటే నేనుంటా.. టాటా అంత్యక్రియల్లో పాల్గొన్న పెంపుడు కుక్క గోవా.. కన్నీళ్లు ఆగవు

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×