Atlee – Allu Arjun : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులలో అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న ప్రాజెక్టు ఒకటి. ఈ ప్రాజెక్టు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. దాదాపు 800 కోట్లు వరకు ఈ ప్రాజెక్టు నిమిత్తం ఖర్చుపెట్టనున్నట్లు తెలుస్తుంది. కేవలం డైరెక్టర్ మరియు హీరో రెమ్యూనరేషన్ దాదాపు 200 కోట్లు అవుతుంది. పుష్ప సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేస్తాడు అని అందరూ ఊహించారు. కానీ అనూహ్యంగా అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తూ వచ్చాయి. కొన్ని రోజుల తర్వాత దీని గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేయబోతున్న సినిమా 2026 డిసెంబర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు కూడా కథనాలు వినిపిస్తున్నాయి.
కాస్ట్ అండ్ క్రూ ఫైనల్ కాలేదు
మామూలుగా ఒక సినిమా చేస్తున్నప్పుడు చాలా ప్లానింగ్ ఉంటుంది. సినిమాలో నటించే నటీనటులు డేట్స్, అలానే టెక్నీషియన్స్ డేట్స్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ప్రాజెక్టు మొదలు పెడుతూ ఉంటారు. కానీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి బహుశా విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉండటం వలన కావచ్చు ముందు దాని మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఇకపోతే ఈ సినిమాలో దీపికా పదుకొనే నటిస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి దీపికా పదుకొనే స్పిరిట్ సినిమా నుంచి తప్పించినట్లు కూడా తెలుస్తుంది. కానీ దీని గురించి ఎక్కడ అధికారకంగా ప్రకటించలేదు. ఇక పారడైజ్ సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు ను కూడా తొలగిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు జీకే విష్ణు సినిమాటోగ్రాఫర్ గా అల్లు అర్జున్ అఖిల్ సినిమాను చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో వేరే ప్రాజెక్టు మానేసిన వాళ్లంతా కూడా ఈ ప్రాజెక్టు కోసం చేరుతున్నట్లు కొందరికి ఊహగానాలు మొదలయ్యాయి.
టాప్ సినిమాటోగ్రాఫర్
ఇక జీకే విష్ణు గురించి ప్రత్యకించి చెప్పాల్సిన అవసరం లేదు. జీకే విష్ణు కి అట్లీకి మధ్య మంచి బాండింగ్ ఉంది. వీరిద్దరూ కలిసి ఇదివరకే బిగిల్ సినిమాకు పనిచేశారు. విజయ నటించిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ హీరోగా చేసిన జవాన్ సినిమా కూడా జీకే విష్ణు సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాతో మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా పైన కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ ప్రాజెక్టులో రోజుకు ఒకరి పేరు వినిపిస్తుంటే, ఇంకా ఈ సినిమాకి టెక్నీషియన్స్ అండ్ కాస్ట్ ఫైనల్ కాకపోవడం ఏంటి అని అనుమానాలు మొదలవుతున్నాయి.
Also Read : Allu Arjun Driving : ఏంటి భాయ్ కారు అలా ఎక్కించేసావ్, సినిమా అనుకున్నావా.?