Foreign Like Places: భారతదేశ అందాలను అనేక విదేశీ ప్రదేశాలతో పోల్చుతారు. ఇక్కడి చాలా ప్రదేశాలు విదేశీ ప్రదేశాలలా కనిపించడమే కాకుండా.. అక్కడ సారూప్యతను కూడా కలిగిస్తాయి. ఒక వేళ మీరు విదేశాలకు వెళ్లలేకపోతే.. తక్కువ ఖర్చుతో విదేశాల లాంటి అనుభూతిని పొందాలంటే.. భారతదేశంలోని ఈ ప్రదేశాలను తప్పకుండా చూడండి. భారతదేశంలోని ఈ ప్రదేశాలను చూడటం ద్వారా విదేశీ అందాలను ఆస్వాదించవచ్చు. ఈ ప్రదేశాలు మీ యాత్రను చిరస్మరణీయంగా మార్చడమే కాకుండా.. ప్రకృతి యొక్క విలువైన వారసత్వంతో మిమ్మల్ని అనుసంధానిస్తాయి. ప్రపంచంలోని ప్రసిద్ధ ప్రదేశాలతో పోల్చబడిన భారతదేశంలోని ప్రదేశాలు, వాటి గురించిన పూర్తి వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీనగర్- ఆమ్‌స్టర్‌డామ్ :
జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ చాలా అందమైన ప్రదేశం. ఇక్కడి దాల్ సరస్సు, షికారా రైడ్ , తులిప్ పూల తోట దృశ్యాలు విదేశాలలోని కొన్ని ప్రదేశాలను పోలి ఉంటాయి. శ్రీనగర్‌లోని దాల్ సరస్సు ఒడ్డున వికసించే తులిప్ పూల తోట, చుట్టుపక్కల ప్రశాంతమైన వాతావరణం మీకు నెదర్లాండ్స్‌లోని ఆమ్స్టర్‌డామ్‌ను గుర్తుకు తెస్తాయి. “ఇందిరా గాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్” అని పిలువబడే ఈ గార్డెన్ ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ .
గుల్మార్గ్:
గుల్మార్గ్ మంచుతో కప్పబడిన పర్వతాలు, స్కీయింగ్ రిసార్ట్‌లు, అందమైన పచ్చికభూముల కారణంగా “భారతదేశ స్విట్జర్లాండ్” అని పిలువబడుతుంది. ఇక్కడ గొండోలా సవారీలు , వింటర్ గేమ్స్ చాలా ఫేమస్. అందుకే ఇక్కడికి నిత్యం చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి చాలా ప్రాంతాలు స్విట్జర్లాండ్ లాగా ఉంటాయి.
Also Read: 10 వేలలోపే బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్.. సమ్మర్‌లోనూ మంచు అందాలు ఎంజాయ్ చేయొచ్చు
ఉత్తరాఖండ్‌లోని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్:
వర్షాకాలంలో ఉత్తరాఖండ్ లోని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌లో వేలాది రంగురంగుల పువ్వులు వికసిస్తాయి. అప్పుడు ఈ ప్రాంతం USA లోని కాలిఫోర్నియాలోని యాంటెలోప్ వ్యాలీని పోలి ఉంటుంది. ఈ రెండు ప్రదేశాలు ప్రకృతి ప్రేమికులు, ఫోటోగ్రఫీ ఔత్సాహికులకు బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు.
థార్ ఎడారి, రాజస్థాన్:
రాజస్థాన్ లోని థార్ ఎడారి మీకు సహారా ఎడారిని గుర్తు చేస్తుంది. మీరు సహారా ఎడారిలోని ఇసుక దిబ్బలు, ఒంటెల సవారీలు, ఎడారి సంస్కృతిని చూడొచ్చు. జైసల్మేర్ , సామ్ ఇసుక దిబ్బలు ఈ ప్రాంతంలోని ప్రధాన ఆకర్షణలు.