Teja Sajja: ఇండస్ట్రీలో చాలామంది హీరోలు… హీరోయిన్స్ డాక్టర్స్ కాబోయే యాక్టర్స్ అయినవారు ఉన్నారు. అలాగే మంచి చదువు ఫినిష్ అయ్యాక ఇండస్ట్రీకి వచ్చినవారు ఉన్నారు. ఉద్యోగాలు మానేసి సినిమాపై ఆసక్తితో కష్టపడినవాళ్లు ఉన్నారు. అయితే ఒక కుర్ర హీరో మాత్రం ఈ చదువులు అవి తన వల్ల కాలేదని హీరో అయినట్లు చెప్పుకురావడం ఆసక్తికరంగా మారింది. ఆ హీరో ఎవరో కాదు తేజ సజ్జ. బాల నటుడిగా కెరీర్ ను ప్రారంభించిన తేజ.. ఇంద్ర సినిమాతో ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. నేనున్నా నాయనమ్మ అనే ఒకే ఒక్క డైలాగ్ తో కెరీర్ లో మర్చిపోలేని పాత్రలో నటించి మెప్పించాడు.
స్టార్ హీరోల సినిమాలన్నింటిలోనూ తేజ బాల నటుడిగా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. సాధారణంగా చైల్డ్ ఆర్టిస్ట్ లు చిన్నతనంలో, తెలిసి తెలియని వయసులో హీరోల పక్కన నటించినా.. ఒక వయసు వచ్చేసరికి చదువు మీద ఫోకస్ పెట్టి కనీసం గ్రాడ్యుయేషన్ అయినా పూర్తి చేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం చూస్తూనే ఉన్నాం. ఇంకొంతమంది మాత్రం ఒకపక్క సినిమాలు చేస్తూనే ఇంకోపక్క చదువును నిర్లక్ష్యం చేయకుండా డిగ్రీ పట్టా పొందిన వారిని చూస్తూనే ఉన్నాం. కానీ తేజ మాత్రం బిటెక్ చదవలేక ఇండస్ట్రీ లకి వచ్చినట్లు చెప్పుకొచ్చాడు.
“మొదట మా నాన్నకు నన్ను సినిమాల్లో తీసుకురావడం ఇష్టం లేదు. చిన్నప్పుడు నేను సినిమా షూటింగ్ కి వెళ్లి వచ్చి అక్కడ విషయాలు ఇంట్లో చెప్పడం. నేను ఎంత ఆనందంగా ఉన్నానో చూసి ఆయన నేను సినిమాల్లో చేయడానికి ఒప్పుకున్నారు. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సమయంలో ఒకరోజు నాన్న దగ్గరకు వెళ్లి ఈ ఇంజనీరింగ్ చదువు నాకు అబ్బడం లేదు. నేను సినిమాల్లో హీరోగా నటిస్తాను అని చెప్పడంతో.. ఆయన వెంటనే ఓకే అన్నారు” అని తేజ చెప్పుకొచ్చాడు. అలా తాను హీరోగా మారినట్లు తెలిపాడు.
ఇక ఓ బేబీ సినిమాతో తేజ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత తేజ హీరోగా మారి జాంబిరెడ్డి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. సాధారణంగా కుర్ర హీరోలు ఒక సినిమా హిట్ అయ్యిందంటే వచ్చే ప్రతి అవకాశాన్ని చేజిక్కించుకోవాలని చూస్తూ ఉంటారు. కానీ, తేజ మాత్రం ఆ పని చేయకుండా చాలా సెలెక్టివ్ గా కథలను ఎంచుకుంటూ వచ్చాడు. చిన్న వయసులోనే ఎంతో మేచ్యుర్డ్ గా ఆలోచించి హనుమాన్ సినిమాను సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ సినిమా ఏకంగా వందల కోట్ల వసూళ్లు సాధించి ఒక్కసారిగా తేజను పాన్ ఇండియా హీరోగా మార్చింది.
ఇక ఈ సినిమా తర్వాత ప్రస్తుతం తేజ మరో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న మిరాయ్ లో నటిస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సూపర్ యోధ పాత్రలో తేజ నటిస్తుండగా మంచు మనోజ్ విలన్ గా కనిపించనున్నాడు . ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న మిరాయ్ ఆగస్టులో రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో ఈ కుర్ర హీరో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు చూడాలి