మచ్చలేని చర్మం అందంగా కనిపిస్తుంది. కానీ మొటిమలు, వాటి వల్ల వచ్చే గుంతల వల్ల అందం తరిగిపోతుంది ఎంతో మంది యువత. మొటిమలను, మొటిమల వల్ల వచ్చే గుంతలను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ చాలావరకు అవి తగ్గడం లేదు. చర్మం నిపుణులు చెబుతున్న ప్రకారం మొటిమలను తగ్గించడంలో, మొటిమల వల్ల ఏర్పడిన గుంతలను తగ్గించడంలో సాలిసిలిక్ యాసిడ్ అద్భుతంగా పనిచేస్తుంది.
సాలిసిలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ సీరమ్ తీసుకొని మొటిమలు వస్తున్న చోటా లేదా గుంతలు ఉన్నచోట ప్రతిరోజూ అప్లై చేయడం ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు. దీన్ని కనీసం మూడు నెలలు వాడితే మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. అయితే సాలిసిలిక్ యాసిడ్ ఎలా వాడాలో తెలుసుకోండి.
సాలిసిలిక్ యాసిడ్ తో సమస్య
చర్మవ్యాధి నిపుణులు చెబుతున్న ప్రకారం సాలిసిలిక్ యాసిడ్ ను ఎప్పుడూ కూడా పొడి చర్మం పైనే రాయాలి. తేమతో కూడిన లేదా తడిగా ఉన్న చర్మంపై రాస్తే అది మంట, చికాకు కారణమవుతుంది. మరింతగా పొడిబారే సమస్య పెరుగుతుంది. కాబట్టి ముఖం కడిగిన తర్వాత దాన్ని పూర్తిగా తుడిచి పొడిగా మార్చుకోవాలి. అప్పుడే ఈ సాలిసిలిక్ యాసిడ్ సీరంను రాయాలి.
సాలిసిలిక్ యాసిడ్ అనేది ఎక్స్పోలియేటింగ్ ఏజెంట్ అంటే చనిపోయిన చర్మ కణాలను కూడా తొలగిస్తుంది. దీనివల్ల అక్కడున్న చర్మం పొడిగా మారిపోతుంది. కాబట్టి సాలిసిలిక్ యాసిడ్ రాసిన తర్వాత ఒక గంట రెండు గంటల పాటు అలా వదిలేయాలి. తర్వాత ముఖాన్ని కడిగి మాయిశ్చరైసర్ ను కూడా అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం తిరిగి హైడ్రేటెడ్ గా మారుతుంది. చికాకు, పొడి బారడం వంటి సమస్యలు రావు.
సాలిసిలిక్ యాసిడ్ ను ఎప్పుడూ నేరుగానే వాడాలి. దానిలో ఇతర సమ్మేళనాలను కలపకూడదు. ఇతర సమ్మేళనాలు కలిసినా సాలిసిలిక్ యాసిడ్ వాడితే చర్మం మరింతగా పొడిబారిపోతుంది. రెటినోల్, గ్లైకోలిక్ యాసిడ్ వంటి ఇతర బయో యాక్టివ్‌లు కలిసిన సాలిసిలిక్ యాసిడ్ వాడటానికి దూరంగా ఉండాలి.
ఎన్నిసార్లు రాయాలి?
సాలిసిలిక్ యాసిడ్ ఒక రోజు రాసుకోవాల్సిన అవసరం లేదు. వారానికి రెండు నుంచి మూడుసార్లు వాడితే సరిపోతుంది. దీన్ని అధికంగా వాడితే చర్మం సహజత్వం దెబ్బతింటుంది.
రాత్రిపూట సాలిసిలిక్ యాసిడ్ రాసే అలవాటు ఉంటే పగటిపూట మీరు కచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ రాయండి. ఇది చర్మం పై నల్ల మచ్చలను తగ్గిస్తుంది. అకాల వృద్ధాప్యం నుండి రక్షిస్తుంది.
సాలిసిలిక్ యాసిడ్ కాస్త ఖరీదైనదే. కానీ మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇది 400 రూపాయల నుండి 600 రూపాయల వరకు దొరకవచ్చు. కేవలం ఒక ఒకటి లేదా రెండు చుక్కలు మొటిమలు వస్తున్న చోట రాస్తే చాలు… మూడు నెలల్లోనే మీకు అక్కడ చర్మం మారడం కనిపిస్తుంది. మొటిమలు రావడం తగ్గుతుంది. అలాగే గుంతలు కూడా తగ్గి చర్మం మృదువుగా, నున్నగా మారుతుంది.