E-Paper
Advertisement

Teja Sajja: IIFA కంట్రావర్సి కి క్లారిటీ ఇచ్చిన తేజ సజ్జ

Teja Sajja: IIFA కంట్రావర్సి కి క్లారిటీ ఇచ్చిన తేజ సజ్జ
Advertisement

Teja Sajja: తేజ సజ్జ చిన్నప్పుడే చాలామంది స్టార్ హీరోలతో నటించి, స్టార్ హీరోల సినిమాల్లో నటించి అద్భుతమైన పేరుని సాధించుకున్నాడు. అయితే ఎట్టకేలకు కొన్ని సంవత్సరాలు తర్వాత తాను చిన్నప్పుడు ప్రూవ్ చేసుకున్న ఫిలిం ఇండస్ట్రీలోని హీరోగా ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నాలు చేశాడు. ఓ బేబీ సినిమాలో మొదట లీడ్ రోల్ లో కనిపించాడు తేజసజ్జ. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసినా కూడా ప్రశాంత్ వర్మ, తేజ కాంబినేషన్లో వచ్చే సినిమాలకు మాత్రమే మంచి పేరు వచ్చింది. తేజ సజ్జ ఇదివరకే హనుమాన్ ఫంక్షన్ లో మాట్లాడుతూ ఎన్టీఆర్ కి రాజమౌళి, రవితేజ కి పూరి జగన్నాథ్, తేజ సజ్జాకి ప్రశాంత్ వర్మ అని అంటూ చెప్పుకుని వచ్చాడు.

ఇకపోతే ప్రశాంత్ వర్మ, తేజ కాంబినేషన్లో వచ్చిన సినిమా హనుమాన్. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ముందు చాలా తక్కువ థియేటర్లో రిలీజ్ అయింది. హైదరాబాద్ లో ఈ సినిమాకు చాలా తక్కువ థియేటర్స్ మాత్రమే దొరికాయి. కానీ ఈ సినిమా మంచి టాక్ సాధించడం వలన ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమాకు కూడా ఇంకొంచెం థియేటర్ల్ ను కేటాయించారు. అయితే సక్సెస్ఫుల్ గా సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ హిట్ సాధించింది ఈ సినిమా. ఈ సినిమాతో తేజ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. రీసెంట్ గా ఐఫా ఈవెంట్లో రానా తో పాటు హోస్ట్ చేసాడు తేజ. దీనివలన తేజకు విపరీతమైన నెగటివిటీ వచ్చేసింది. దీనికి కారణం చాలా సినిమాలు పైన కొంతమంది హీరోలు పైన సెటైర్లు వేయడమే. సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన సినిమాలు గురించి, ఆదిపురుష్ సినిమా గురించి ఇలా చాలా విషయాల ప్రస్తావన ఆ ఈవెంట్ లో వచ్చింది.

Advertisement

Also Read : Matka Collections : దారుణంగా పడిపోయిన ‘ మట్కా ‘ కలెక్షన్స్.. రెండు రోజులకు ఎన్ని కోట్లంటే?

మొత్తానికి దీని గురించి క్లారిటీ ఇచ్చాడు తేజ. రీసెంట్ గా జరిగిన ఒక సినిమా ఫంక్షన్ కి హాజరైన తేజ ను మళ్ళీ ఐఫా కి హోస్టింగ్ చేస్తారా అని యాంకర్ అడిగితే, ఖచ్చితంగా చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తరువాత ఐఫా కి సంబంధించి ఆ జోక్స్ ని చాలామంది వెరిఫై చేసి మాకు ఇస్తారు. అక్కడ రానా గారు వేసిన జోక్స్ అన్నీ కూడా నా మీదే వేశారు అంటూ జెన్యూన్ గా చెప్పుకొచ్చాడు. ఇక దీనిని అర్థం చేసుకొని ఇకపైన తేజాని నెటిజెన్స్ వదిలేస్తారో లేదో వేచి చూడాలి. ముఖ్యంగా తేజ చేసిన కామెంట్స్ చాలామంది సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులను బాధించాయని చెప్పాలి. సంక్రాంతి సీజన్ లో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాతో పాటుగా హనుమాన్ సినిమా విడుదలైంది. గుంటూరు కారం సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. హనుమాన్ సినిమాకి మంచి హిట్ టాక్ వచ్చింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×