E-Paper
Advertisement

Matka Collections : దారుణంగా పడిపోయిన ‘ మట్కా ‘ కలెక్షన్స్.. రెండు రోజులకు ఎన్ని కోట్లంటే?

Matka Collections : దారుణంగా పడిపోయిన ‘ మట్కా ‘ కలెక్షన్స్.. రెండు రోజులకు ఎన్ని కోట్లంటే?

Matka Collections : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ ‘ మట్కా ‘.. కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్, వైర ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రజనీ తాళ్లూరి, విజేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. భారీ యాక్షన్ సన్ని వేశాలతో, భారీ అంచనాలతో నవంబర్ 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. కథ పరంగా ఆకట్టుకోలేక పోయిందనే టాక్ బాక్సాఫీస్ వద్ద వినిపిస్తుంది. ఇక కలెక్షన్స్ కూడా అంతంత మాత్రంగానే రావడంతో నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు. కనీసం ఈ వీకెండ్ అయిన సినిమా కలెక్షన్స్ పెరుగుతాయేమో చూడాలి..

పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు భారీ అంచనాలు పెంచాయి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా దెబ్బ కొట్టింది. వరుణ్ తేజ్ లైఫ్ లో ఎన్నడూ లేని విధంగా దారుణంగా కలెక్షన్స్ రాబట్టిందని తెలుస్తుంది. గతంలో వరుణ్ తేజ్ నటించిన సినిమాల్లో ఇంత తక్కువ ఎన్నడూ రాబట్టలేదు. 18 కోట్లకుపైగా షేర్ 36 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. అయితే ఈ సినిమా తొలి రోజు 2 కోట్ల రూపాయల గ్లాస్ వసూళ్లను నమోదు చేసింది.. అలాగే రెండో రోజు 1.5 కోట్లు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తుంది. రెండు రోజుల కలెక్షన్స్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ వీకెండ్ కంగువ తప్ప కొత్త సినిమాలు లేకపోవడంతో ఈ మూవీ కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. ఈ సినిమా మొత్తం వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకేక్కిందని తెలిసిందే. వైజాగ్ ప్రాంతంలో 70వ దశకం నేపథ్యంగా రూపొందిన మట్కా గ్యాబ్లింగ్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రం కథ బలంగా ఉన్నప్పటికీ.. నేరేషన్ చాలా వీక్ ఉండటంతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. మట్కా అనే గ్యాంబ్లింగ్ గేమ్ బ్యాక్ డ్రాప్‌గా ఈ సినిమాను పూర్తిగా పీరియాడిక్ మూవీగా తెరకెక్కించారు. ప్రేక్షకులను 70 దశలోకి తీసుకెళ్లడానికి పూర్తిగా భారీ సెట్స్ వేశారు. నటీనటుల రెమ్యునరేషన్, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషన్స్‌తో కలిపి టోటల్ 40 కోట్ల వ్యయంతో తెరకెక్కింది. కానీ రెండు రోజుల కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ఇక ఈ నెల లోపు సినిమాకు పెట్టిన ఖర్చులను రాబడుతుందేమో చూడాలి.. ఏది ఏమైనా ఈ మూవీ వరుణ్ అభిమానులను నిరాశ పరిచింది. ఇక ఈ సినిమా ఎఫెక్ట్ తదుపరి సినిమాల పై పడిందని తెలుస్తుంది. వరుణ్ నటించాల్సిన ఒక సినిమా పోస్ట్ పోన్ అయ్యిందని సమాచారం.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×