Satyabhama Today Episode November 16 th : నిన్నటి ఎపిసోడ్.. సత్య క్రిష్ పుట్టుక గురించి తెలుసుకోవాలని క్రిష్ పుట్టిన హాస్పిటల్ కు వెళ్ళింది. అక్కడ సత్య ఫైల్స్ ను తిరగేసి వెతుకుతుంది. అయితే ఆ రోజు డెలివరీ అయిన వారిలో ఇద్దరు మాత్రమే ఉన్నారు అని షాక్ అవుతుంది సత్య.. ఇదెలా సాధ్యం అని ఆలోచించి బయట సెక్యూరిటీని అడుగుతుంది. క్రిష్ బయట నుంచి దేవుడికి దండం పెట్టుకుంటాడు. సత్య అనుకున్నది జరగాలని సత్య ముఖంలో సంతోషం చూడాలి అనుకుంటాడు. ఇక సత్య క్రిష్ పుట్టిన రోజున మహదేవయ్య, చక్రవర్తి ఇద్దరి పేర్ల మీద డెలివరీ ఉండటం చూస్తుంది. ఆ రోజు మొత్తంలో రెండు డెలివరీలేనా మరి లేవా అని కంగారు పడి కాంపౌండర్ని ప్రశ్నిస్తుంది. అతనికి తెలియదు అని అంటాడు. కానీ సత్య నిరాశతో బయటకు వస్తుంది. మహాదేవయ్యకు నిజం తెలుసుకున్నాడు. సత్యకు మరో ఛాలెంజ్ విసురుతాడు. ఇక రాత్రి క్రిష్ సత్య ప్రశ్నలకు సమాధానం దొరికేలా చేస్తాడు.. దాంతో ఇద్దరి మధ్య రొమాన్స్ చిగురిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. క్రిష్ సత్య మూడిగా ఉండటం చూసి దగ్గరకు వస్తాడు. అప్పుడు సత్య ఓ రెండు బొమ్మలు తెచ్చి A, B అని సమస్య మొత్తం చెబుతుంది. ఆ రోజు ఇంకెవరూ డెలివరీ కానప్పుడు వాళ్లిద్దరే బిడ్డల్ని మార్చుకుని ఉండొచ్చు అంటాడు క్రిష్.. అయితే సత్య ఇది ఎలా సాధ్యమని ఆలోచిస్తుంది. దానికి క్రిష్ ఆలోచించడం ఎందుకు ఆ ఇద్దరిలోనే బిడ్డల మార్పిడి జరిగిందని సింపుల్ సలహా ఇస్తాడు. అది ఆలోచించండి సత్య నాకెందుకు ఇలాంటి ఆలోచన రాలేదు ఇది నిజమే అయ్యుంటుందని ఆలోచిస్తుంది. ఇలాంటివి రేడియోలో మస్తు చెప్తూ ఉంటారు ఎప్పుడు వినలేదా సత్యాన్ని క్రిష్ చెప్తుంటే ఆలోచించి క్రిష్ ను వెనకాల నుంచి హగ్ చేసుకుంటుంది సత్య. కాసేపు వీరిద్దరి మధ్య రొమాన్స్ సాగుతుంది. ఇక ఉదయం లేవగానే సత్య మొక్కలకి నీళ్లు పోస్తుంది. తన గన్ని శుభ్రం చేస్తూ ఉంటాడు. అప్పుడే సంజయ్ అక్కడికి వస్తాడు ఏంటి బ్రో పర్సనల్ గన్నా ఏంటి ఒకసారి ఇలా ఇవ్వు అనేసి అడుగుతాడు. నీకు క్రిష్ ఇదేమైనా బొమ్మలతో పైకి అనుకున్నావా బ్రో. పేల్తే ఇంక ప్రాణాలు పోతాయి అని అంటాడు. కానీ సంజయ్ గన్ను తీసుకుంటాడు.
గన్ను తీసుకొని ఆట పట్టిస్తుంటే గన్ను పేలుతుంది. ఆ సౌండ్ కి సంజయ్ భయపడి గన్ను విసిరేస్తాడు. అది చూసిన సత్య క్రిష్ లు నవ్వుకుంటారు. వాళ్ళిద్దరు నవ్వడం చూసి సంచి కోపంతో రగిలిపోతాడు. ఆపండి నన్ను చూసి నవ్వుతారే అనేసి కోపంగా అంటాడు. గన్ పేలిన సౌండ్ రావడంతో ఇంట్లోంచి అందరూ బయటకు వస్తారు. భయ్యా ఏమైందని అడుగుతాడు. దానికి సత్యా కృష్ణులు నవ్వుతూ ఉంటారు. నవ్వడం ఆపి ఏమైందో జర చెప్పండి అని మహదేవయ్యా అడుగుతాడు. సంజయ్ గన్ను తీసుకొని పేల్చాడు అందుకే భయపడిపోయాడు అని అంటాడు. దానికి షేమ్ గా ఫీల్ అయిన సంజయ్ ఇంత దాకా వచ్చాక వెనక్కి తగ్గేదే లేదు మనిద్దరం ఒక పోటీ పెట్టుకుందామని అంటాడు.. పోటీయా ఏంది బ్రో అని క్రిష్ అడుగుతాడు. దానికి సంజయ్ బుల్లెట్లను తీసి పక్కన పెట్టి ఒక బుల్లెట్ మాత్రమే గన్ లో పెడతాడు. ఇద్దరికీ మూడు మూడు చాన్సులు. ఎవరిది పేలుతుందో ఎవరిది పేలదో ఇప్పుడే తెలుసుకుందాం ధైర్యం ఉందా అసలు నువ్వు మగాడివేనా అనేసి అంటాడు. ఇక ఇద్దరు పోటీపడి మూడు ఛాన్సులు వాడుకుంటారు.
మహదేవయ్యా కొడుక్కి ఎక్కడ ఏమవుతుందని సంజయ్ కాలుస్తున్నప్పుడు భయపడతాడు. కృష్ణ కాలుస్తున్నప్పుడు సత్య చక్రవర్తిలో భయపడతారు. ఇంట్లో అందరూ సంజయ్ ని అంటారు. మహదేవయ్య కూడా తన కొడుకుని ఎలా కాపాడుకోవాలని చూస్తాడు. సంజయ్ అమాయకుడు వాడి గురించి మీకెందుకురా నువ్వు క్రీస్తు పెట్టుకోవడం ఏంటి రా అని ఇద్దరికీ చెప్తాడు. ఇంటికి ఒక బంధువు మాత్రమే బంధువి బంధువు లాగే ఉండాలి అని అంటాడు చక్రవర్తి. దానికి మహదేవయ్యా రియాక్ట్ అవుతాడు. ఇంటికి వాడికి సంబంధం లేదని ఎందుకంటారు ఇంటికి వాడు ఏమవుతాడో తెలుసా అని నిజం చెప్పబోతాడు. ఇంటికి వాడు కూడా వారసుడే. అనగా నాకు అన్ని అధికారాలు ఉన్నాయి అనేసి మహాదేవ లోపలికి వెళ్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపు ఏం జరుగుతుందో చూడాలి..