Teja Sajja Mirai Teaser: ప్రముఖ చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జ (Teja Sajja) ‘హనుమాన్’ సినిమా తర్వాత భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మరో పాన్ ఇండియా చిత్రం మిరాయ్ (Mirai). సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా సినిమా నుండి టీజర్ విడుదల చేశారు. టీజర్ అధ్యంతం ఆకట్టుకోవడమే కాకుండా హనుమాన్ కి మించి ఉంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా జగపతిబాబు(Jagapathi babu) కీలక పాత్ర పోషిస్తూ ఉండగా.. మంచు మనోజ్ (Manchu Manoj) ఇందులో విలన్ గా నటిస్తున్నారు. ఇకపోతే తేజా సజ్జ హీరోగా వస్తున్న ఈ సినిమా టీజర్ లో ఇప్పుడు మంచు మనోజ్ పాత్రను హైలైట్ చేస్తూ రిలీజ్ చేయడం నిజంగా భైరవం సినిమాకు కలిసొచ్చేలా ఉందని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే సినిమా నుండి విడుదల చేసిన టీజర్ భారీ రెస్పాన్స్ అందుకుంటోంది.
మిరాయ్ టీజర్ విశేషాలు..
తాజాగా సినిమా నుండి విడుదల చేసిన టీజర్ లో.. “జరగబోయేది మారణహోమం.. శిధిలం కాబోతోంది అశోకుడి ఆశయం.. కలియుగంలో పుట్టిన ఏ శక్తి కూడా దీనిని ఆపలేదు” అని జయరాం చెప్పిన డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది.ఇందులో మంచు మనోజ్ ఈ రాయితోనే నన్ను కొట్టింది అంటూ కత్తి పట్టి రౌద్రం చూపిస్తూ నరకడం మొదలు పెడతాడు. ఇన్ని రోజులు హీరోగా, మాస్, యాక్షన్, రొమాంటిక్, కామెడీ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన మంచు మనోజ్ ఇప్పుడు విలన్ గా తనలోని నట విశ్వరూపాన్ని ఈ సినిమా ద్వారా అందరికీ పరిచయం చేయబోతున్నారు. ముఖ్యంగా మంచు మనోజ్ తన నటనతో ఇరగదీసాడంటే.. తేజ తన యాక్టింగ్తో అదరహో అనిపిస్తున్నారు. ఇక ఎవరికి వారు తమ నటనకు పూర్తిస్థాయి న్యాయం చేశారని టీజర్ చూస్తే స్పష్టం అవుతోంది. ఇక సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుంటుందని అటు మహేష్ , ఇటు మంచు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
మిరాయ్ సినిమా విశేషాలు..
హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న యువ హీరో తేజసజ్జ ఇప్పుడు కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో సూపర్ యోధా గా తేజ నటిస్తూ ఉండగా.. రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు, స్పెషల్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసాయ్. దీనికి తోడు ఇప్పుడు టీజర్ కూడా ఆడియన్స్ ని కట్టిపడేస్తోంది.
ALSO READ:Kamal Haasan: తమిళం నుంచే కన్నడ పుట్టింది.. కమలహాసన్ వ్యాఖ్యలపై కర్ణాటకలో దుమారం..!