Telugu Movies ..టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా దిగ్గజ దర్శకులుగా పేరు తెచ్చుకున్న వారిలో రాజమౌళి (Rajamouli), సుకుమార్ (Sukumar ), ప్రశాంత్ నీల్ (Prashanth Neel), నాగ్ అశ్విన్ (Nag Ashwin), సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఇలా కొంతమంది పేర్లు ప్రధమంగా వినిపిస్తూ ఉంటాయి. వీరంతా కూడా తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించి, తమ సత్తా ఏంటో చాటారు. ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమను చులకనగా చేసిన బాలీవుడ్ పరిశ్రమకే నేడు అవకాశాలు ఇచ్చే రేంజ్ కి టాలీవుడ్ సినిమాను పెంచారు అంటే.. ఇక దీని వెనుక దర్శకుల కష్టం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తెలుగు సినిమా అంటే ఒక బాలీవుడ్ మాత్రమే కాదు.. ఇంటర్నేషనల్ ఫిలిం ఇండస్ట్రీ కూడా ఎదురు చూసేలా చేశారు. ఇంత భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ స్టార్ డైరెక్టర్స్ ఆడియన్స్ అందర్నీ పిచ్చోళ్లను చేసారు అనే ఒక వార్త తెరపైకి వచ్చింది. కార్టూన్స్ చూసి కాపీ కొట్టారని కొంతమంది కామెంట్లు చేస్తుంటే కార్టూన్స్ చూసి కాపీ కొట్టే కర్మ మీకేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కార్టూన్స్ చూసి కాపీ కొట్టిన డైరెక్టర్స్..
ఇంతకు అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో హల్చల్ చేస్తోంది . ఆ వీడియోలో కార్టూన్స్ చేసిన సిగ్నేచర్ స్టెప్స్ ని ఇక్కడ దర్శకులు మన తెలుగు సినిమాలలో అప్లై చేయడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు ఏ సన్నివేశాలు అయితే ఆడియన్స్ లో గూస్ బంప్స్ తెప్పించాయో.. ఆ సన్నివేశాలు కార్టూన్స్ నుంచి కాపీ కొట్టారు అని తెలిసి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఇంతకూ ఆ వీడియోలో ఏముంది అనే విషయానికి వస్తే.. టామ్ అండ్ జెర్రీ కార్టూన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఈ కార్టూన్స్ ని చూడడానికి ఇష్టపడతారు. చూసినంత సేపు మనల్ని మనం మైమరిచిపోతాం అనడంలో సందేహం కూడా లేదు.. అంతలా టామ్ అండ్ జెర్రీ కార్టూన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
పుష్ప, పుష్ప 2 లో ఈ సన్నివేశాలు కాపీ నేనా..?
అయితే ఇప్పుడు ఈ టామ్ అండ్ జెర్రీలో భాగంగా జెర్రీ ‘తగ్గేదేలే’ అనే సిగ్నేచర్ స్టెప్ ని ఎప్పుడో చూపించింది. అదే స్టెప్ ని సుకుమార్ (Sukumar) తన మూవీ పుష్పలో అల్లు అర్జున్ చేత చేయించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఈ తగ్గేదేలే అనే సిగ్నేచర్ స్టెప్ ఎంత వైరల్ అయిందో అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదే కాదు శ్రీవల్లి పాటలో ఒక కాలు ఈడ్చుతూ అల్లు అర్జున్ చేసే డ్యాన్స్ స్టెప్ కూడా టామ్ అండ్ జెర్రీ కార్టూన్స్ నుంచి తీసుకున్న స్టెప్ కావడం గమనార్హం. అంతే కాదండోయ్ పుష్ప లోనే కాదు పుష్ప 2 లో కూడా అల్లు అర్జున్ “సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉన్నాడే నా సామి” అనే పాటలో వేసే స్పీడ్ స్టెప్ కూడా ఈ కార్టూన్స్ నుంచి కాపీ కొట్టినదే.
సుకుమార్ మాత్రమే కాదండోయ్ రాజమౌళి కూడా..
అయితే ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం మరోటి ఏమిటంటే.. సుకుమార్ మాత్రమే కాదు దిగ్గజ దర్శకుడు రాజమౌళి కూడా ఈ కార్టూన్స్ నుంచి కొన్ని సన్నివేశాలను కాపీ కొట్టారు. అందులో ప్రత్యేకించి ‘బాహుబలి 2’ లో బాహుబలి దేవసేనను తన సామ్రాజ్యానికి తీసుకెళ్లేటప్పుడు.. దుండగుల చేతుల్లో వంతెన విరిగిపోతే.. ఆ వంతెనకు పడవకు మధ్య వారధిలా ప్రభాస్ నిలబడతాడు. ఆయన భుజాలపైన అనుష్క నడుచుకుంటూ పడవలోకి వెళ్తుంది. ఈ సన్నివేశం సినిమాలో ఎంత హైలైట్ గా నిలిచిందంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇది కూడా టామ్ అండ్ జెర్రీ కార్టూన్స్ నుంచి తీసుకోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మొదట్లోనే ఎన్టీఆర్ పులితో పోరాటం తర్వాత రెండు తాళ్ళను బలంగా లాక్ చేసే సన్నివేశం కూడా ఈ కార్టూన్స్ నుంచి తీసుకున్నదే.
also read: Sai Pallavi:సాయి పల్లవి పాకిస్థాన్‌కు పారిపో… లేడీ పవర్ స్టార్‌కి ఉప్పల్ బాలు బ్యాచ్ వార్నింగ్
ఇక ఇవన్నీ చూసిన తర్వాత ఎంత మోసపోయాము అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు ఆడియన్స్. మొత్తానికి అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.
?igsh=MTNyYWg1OTQ5Mmh5eQ==