Iron Rich Foods: ప్రస్తుత కాలంలో చాలా మంది ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం మనం తినే ఆహారాల వల్ల ఐరన్ లోపం ఎక్కువగా వస్తుంది. అసలు శరీరంలో ఐరన్ లోపం అంటే నేరుగా అన్ని భాగాలకు ఆక్సిజన్ అందించడానికి పని చేసే ఎర్ర రక్త కణాల పరిమాణం క్షీణించడం. ఎవరైనా ఐరన్ లోపంతో బాధపడుతున్నప్పటికీ, గర్భిణీ, బహిష్టు మహిళల్లో ఐరన్ లోపం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఐరన్ లోపాన్ని అధిగమించడానికి సప్లిమెంట్లు అందుబాటులో ఉన్నప్పటికీ, కొన్ని ఆహారాల సహాయంతో కూడా దీనిని నయం చేయవచ్చు.
శరీరంలో ఐరన్ లోపం ఉంటే, హిమోగ్లోబిన్ లెవల్స్ పడిపోతాయి. ఇది రక్తహీనతకు దారితీస్తుంది. దీంతో అలసట, బలహీనత, మైకం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐరన్ లోపాన్ని అధిగమించాలంటే ఎలాంటి ఆహారాలు తినాలి,
మునగాకుసాధారణంగా మునక్కాయల కంటే మునగాకులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పాలకూరతో పోలిస్తే మునగాకులో 28 మి.గ్రా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటితో జ్యూస్ చేసుకొని తాగవచ్చు లేదా వండుకుని తినవచ్చు. లేకపోతే ఇతర వంటకాల్లో యాడ్ చేయవచ్చు. ఐరన్ లోపంతో బాధపడేవారు మునగాకులు తింటే, సమస్య దూరమై హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది.
వివిధ రకాల నట్స్, సీడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే గుమ్మడికాయ, చియా, ఫ్లాక్స్ వంటి విత్తనాల్లో ఐరన్, ఫోలేట్, జింక్, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని సలాడ్స్, ఓట్‌మీల్, స్మూతీస్‌లో కలిపి తీసుకోవచ్చు. దీంతో శరీరంలో ఐరన్ లోపం తగ్గుతుంది, రక్తంలో హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయని చెబుతున్నారు.
బచ్చలి కూరలో ఐరన్, ఇనుము ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది ఇనుము శోషణను పెంచుతుంది. శరీరంలో రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారికి బచ్చలి కూర వినియోగం చాలా ఉంటుంది.
గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, సిట్రస్ ఫ్రూట్స్ రక్తంలో ఫోలిక్ యాసిడ్ లోపం కారణంగా రక్తహీనత ఏర్పడితే తాజా ఆకు కూరలతో ఆ సమస్యకు చెక్ చెప్పవచ్చు. పాలకూరలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. నారింజ, నిమ్మ, ద్రాక్ష, బత్తాయి వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి కంటెంట్ ఉంటుంది. శరీరం ఐరన్ గ్రహించడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. స్విస్‌చార్డ్, కొల్లార్డ్ గ్రీన్స్ వంటివాటిల్లో విటమిన్ సి, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అందుకే ఈ ఆకుకూరలు, కూరగాయలు, సిట్రస్ పండ్లను డైట్‌లో చేర్చుకుంటే శరీరానికి అవసరమైన ఐరన్ కంటెంట్ లభిస్తుంది, రక్తహీనతకు చెక్ చెప్పవచ్చు.
దుంపలు బంగాళదుంపలు, బీట్ రూట్, చిలకడదుంపలు వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఐరన్ కంటెంట్‌తో పాటు రాగి, భాస్వరం, మెగ్నీషియం, విటమిన్ B1, B2, B6, B12, విటమిన్ సీ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ దుంపలను డైట్‌లో చేర్చుకుంటే శరీరంలో ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు. ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని ప్రేరేపించే హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి.
బ్రోకలీలో ఇనుము ఉంటుంది. అలాగే, విటమిన్ సి పుష్కలంగతా ఉండటం వల్ల శరీరం ఇనుమును బాగా గ్రహించేలా చేస్తుంది. అంతే కాదు, దీని వినియోగం క్యాన్సర్ ను నివారించడంలో కూడా ప్రభావమంతగా పరిగణించబడుతుంది.
Also Read: మానసిక ప్రశాంతత కావాలా? అయితే ఇది మీ కోసం..
అంతేకాకుండా రాగి పాత్రలు ఒకప్పుడు మన జీవన విధానంలో రాగి పాత్రలు భాగంగా ఉండేవి. స్టీల్ పాత్రలు అందుబాటులోకి వచ్చాక వీటి వినియోగం తగ్గింది. అయితే రాగి పాత్రల్లో నీరు నిల్వ ఉంచి తాగడం మంచిది. దీనివల్ల శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి పెరిగి, ఆహారం సులభంగా విచ్ఛిన్నం అవుతుంది. ఫలితంగా శరీరం ఐరన్‌ను ఎక్కువగా శోషించుకుంటుంది.
అలాగే మాంసం, పౌల్ట్రి, చేపలు, గుడ్లు వంటి వాటిలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. మీ శరీరానికి ఐరన్ మంచి మూలం, ఇది మీ శరీరం నుంచి ఐరన్ సులభంగా గ్రహిస్తుంది. మీరు మీ ఆహారంలో విటమిన్ సి ఉండేలా చూసుకోండి. ఎందుకంటే విటమిన్ సి మీ శరీరం ఐరన్‌ను సులభంగా గ్రహించేలా సహాయపడుతుంది.