OG Movie: 2025లో ఎన్నో సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో స్టార్ హీరోల ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలు కూడా ఉన్నాయి. అలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్న మూవీ ‘ఓజీ’. ఈ మూవీని సైన్ చేసి కొన్నిరోజులు షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. అప్పుడే ఏపీలో ఎన్నికలు రావడంతో ప్రచారంలో ఫుల్ బిజీగా తిరగడం మొదలుపెట్టారు. దీంతో ‘ఓజీ’ షూటింగ్‌ను పవన్ కళ్యాణ్ లేకుండానే కొన్నాళ్లపాటు కొనసాగించారు. ఇప్పుడు మళ్లీ ‘ఓజీ’ షూటింగ్ మొదలయ్యింది. అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయంపై తమన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తమన్ కామెంట్స్
ప్రస్తుతం టాలీవుడ్‌లో తమన్ (Thaman) మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ అన్నీ తన చేతిలోనే ఉన్నాయి. అంతే కాకుండా సినిమా ఎలా ఉన్నా.. తమన్ అందించిన సంగీతం మాత్రం ప్రేక్షకులను తెగ ఇంప్రెస్ చేసేస్తోంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో దిగిన మూడు సినిమాల్లో రెండు సినిమాలకు తమనే సంగీతం అందించాడు. ఆ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ లభిస్తోంది. అలా మరెన్నో చిత్రాలకు మ్యూజిక్ అందిస్తూ బిజీగా ఉన్నాడు తమన్. అందులో పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ కూడా ఒకటి. తాజాగా ఈ మూవీపై ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేయడం కోసం పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు తమన్.
Also Read: హృతిక్ కెరీర్‌లోనే అదిపెద్ద తప్పు.. రూ.13 వేల కోట్ల లాభాలు తెచ్చిపెట్టిన సినిమా రిజెక్ట్
సమాధానం చెప్తుంది
మీసం తిప్పి మరీ చెప్తున్నాను ఓజీ (OG) సినిమా అన్నింటికి సమాధానం ఇస్తుంది అంటూ ఓ రేంజ్‌లో ‘ఓజీ’పై అంచనాలు పెంచే ప్రయత్నం చేశాడు తమన్. ‘ఓజీ’ సినిమాను ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు సుజీత్. తమిళంలో ఇప్పటికే ‘లియో’, ‘విక్రమ్’, ‘జైలర్’ లాంటి గ్యాంగ్‌స్టర్ డ్రామాలు వచ్చాయి. వాటన్నింటికి మించి, వాటన్నింటికి సమాధానం చెప్పే రేంజ్‌లో ‘ఓజీ’ ఉంటుందని అన్నాడు తమన్. ఆ సినిమాలు విడుదలయిన తర్వాత ఎలాగైతే వాటి గురించి మాట్లాడుకున్నామో పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ విడుదలయిన తర్వాత కూడా ప్రేక్షకులు అలాగే ఈ మూవీ గురించి మాట్లాడుకుంటారని నమ్మకం వ్యక్తం చేశాడు.
మరింత హైప్
ప్రస్తుతం తమన్ చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్‌లో మరింత హైప్ ఎక్కించాయి. ‘ఓజీ’ సినిమా ఎలా ఉండబోతుందా అని ఇప్పటికే వారిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తమన్ ఇలా మాట్లాడడం వల్ల సినిమా పక్కా సూపర్ హిట్ అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు. సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తోంది. విలన్‌గా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీని రంగంలోకి దించాడు సుజీత్. ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్‌లో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్.. ఇప్పుడు ‘ఓజీ’తో తెలుగులో విలన్‌గా మారనున్నాడు. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగనుంది.