Hrithik Roshan: తమ దగ్గరకు వచ్చే ప్రతీ మంచి కథను యాక్సెప్ట్ చేయాలని హీరో, హీరోయిన్స్‌కు ఉన్నా పలు కారణాల వల్ల అలా జరగకపోవచ్చు. అందుకే కొన్ని మంచి మంచి సినిమాలు ఇతర యాక్టర్ల చేతికి వెళ్తుంటాయి. అలా జరిగిన తర్వాత దానికి రిగ్రెట్ అవ్వడం తప్పా నటీనటులకు వేరే ఆప్షన్ ఉండదు. అలా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సైతం తన కెరీర్‌లో ఒక పెద్ద తప్పు చేసేశాడు. ఇటీవల విడుదలయిన ఒక సినిమా రిజెక్ట్ చేశాడు. చివరికి ఈ సినిమాకు రూ.13 వేల కోట్ల లాభాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. దీంతో ఫ్యాన్స్ అంతా ఆ మూవీ హృతిక్ ఖాతాలో పడనందుకు ఫీలవుతున్నారు. ఇంతకీ ఏంటా సినిమా.?
హాలీవుడ్ ఆఫర్
ఇప్పటికే ఎంతోమంది బాలీవుడ్ హీరోహీరోయిన్లు హాలీవుడ్‌కు వెళ్లి అక్కడ కూడా తమ టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు. కానీ ఈ ఖాతాలో ఎక్కువగా హీరోయిన్ల పేర్లే కనిపిస్తాయి. ఆల్రెడీ బాలీవుడ్‌లో స్టార్లుగా వెలిగిపోతున్న హీరోలు.. హాలీవుడ్‌కు వెళ్లి అక్కడ కొత్తగా తమ కెరీర్‌ను ప్రారంభించడానికి ఇష్టపడరు. అందుకే ఎక్కువశాతం బీ టౌన్‌లో సెటిల్ అవ్వడానికి ఇష్టపడతారు. హృతిక్ రోషన్ (Hrithik Roshan) కూడా అలాగే ఆలోచించాడు. అందుకే తన వద్దకు వచ్చిన బడా హాలీవుడ్ ఆఫర్‌ను రిజెక్ట్ చేశాడు. ఒక ప్రముఖ ఫ్రాంచైజ్‌లోని బ్లాక్‌బస్టర్ మూవీని రిజెక్ట్ చేశాడు. అదే రాబ్ కోహెన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫ్యూరియస్ 7’.
Also Read: కాపీ కొట్టారు, రూ.80 వేల కోట్ల నష్టపరిహారం కట్టాల్సిందే.. పాపం ఆ సినిమాకు ఎన్ని కష్టాలో.!
ఛాన్స్ మిస్ అయ్యిందే
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజ్ అనేది హాలీవుడ్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద హిట్‌ను సాధించింది. ఈ ఫ్రాంచైజ్ నుండి ఏడవ సినిమాగా విడుదలయ్యిందే ‘ఫ్యూరియస్ 7’. ఈ సినిమాలో నటించడం కోసం హృతిక్ రోషన్‌ను అప్రోచ్ అయ్యారట మేకర్స్. కానీ అప్పటికే తను పలు బాలీవుడ్ ఆఫర్లతో బిజీగా ఉండడంతో ఈ ఆఫర్‌ను హృతిక్ రిజెక్ట్ చేశాడని సమాచారం. కానీ నిజంగానే తను ఆ సినిమాను ఓకే చేసుంటే పలువురు హాలీవుడ్ స్టార్ హీరోల మధ్య హృతిక్ రోషన్‌ను చూడడం వేరే లెవెల్‌లో ఉండేదని తన ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ‘ఫ్యూరియస్ 7’ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యి భారీ కలెక్షన్స్ కూడా సాధించింది.
ఎన్నో సినిమాలు
‘ఫ్యూరియస్ 7’ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.515 బిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించింది. అంటే దాదాపుగా రూ.13 వేల కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత అధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల లిస్ట్‌లో ‘ఫ్యూరియస్ 7’ 12వ స్థానంలో ఉంటుంది. ఇది మాత్రమే కాదు.. ఇంతకు ముందు కూడా ‘పింక్ పాంథర్ 2’లో లీడ్ రోల్ చేయడానికి హృతిక్ రోషన్‌ను అవకాశం లభించిందట. దానిని కూడా తను రిజెక్ట్ చేయడంతో ఆ స్థానంలోకి మరొక హాలీవుడ్ యాక్టర్ వచ్చాడు. అలా ఇప్పటివరకు తనకు వస్తున్న హాలీవుడ్ ఆఫర్లు అన్నీ రిజెక్ట్ చేసుకుంటూ కేవలం బాలీవుడ్‌కే పరిమితమయ్యాడు హృతిక్.