BigTV English

Ghewar Sweet: ఆ జిల్లాలో సంక్రాంతి స్పెషల్ ఫేవరేట్.. ఈ స్వీట్..

Ghewar Sweet: ఆ జిల్లాలో సంక్రాంతి స్పెషల్ ఫేవరేట్.. ఈ స్వీట్..

Ghewar Sweet: సంక్రాంతి అనగానే ముందుగా అందరికి గుర్తొచ్చేది పిండివంటలే.. సంక్రాంతికి చేసుకునే తీరైన వంటకాలు అందరిని నోరూరిస్తాయి. సంక్రాంతికి ప్రతి ఇంట్లో ఎక్కువగా సకినాలు, అరిసెలు, చెకొడీలు, లడ్డూలు, బోందు, గ్యారెలు, కారాపూసా వంటి సంప్రదాయ వంటకాలే కనిపిస్తాయి. కానీ నిజామాబాద్‌లో మాత్రం ఓ ప్రతేక్యమైన స్వీట్ దొరుకుతుంది.


సంక్రాంతి వారం ముందు నుంచి పండగ అయ్యే వరకు మాత్రమే ఆ స్వీట్ లభిస్తుంది. ఈ స్వీట్ రాజస్థాన్ వాసులకు ఎంతో ఇష్టమైందని స్థానికులు చెబుతున్నారు. నిజామాబాద్ కు వచ్చి స్థిరపడ్డ రాజస్థానీ కుటుంబాల్లోని ఒకరు ఈ ఘేవర్ స్వీట్ తయారుచేయడం ప్రారంభించారు. తొలుత కేవలం మార్వాడీలకు పరిమితమైన ఈ స్వీట్ ను క్రమంగా స్థానికులు ఇష్టంగా తినడంతో ఆదరణ పెరిగింది.

సంక్రాంతికి వారు ముందు నుంచి ఈ స్వీట్ తయారు చేస్తారు.. పదిహేను రోజుల తర్వాత అంటే పండుగ తర్వాత ఆపేస్తారు. ఈ ఘేవర్ స్వీట్ ను మూడు రకాలుగా తయారు చేస్తారు. సాధారణఘేవర్, మలైఘేవర్, షుగర్ లెస్మేవర్లో లభిస్తుందని తయారీదారులు చెబుతున్నారు.


Also Read: BR Naidu: టీటీడీపై ఏదైనా కామెంట్ చేసే ముందు జర్రంతా జాగ్రత్త భయ్యా..!

పాలు, మైదా, గోధుమపిండి, నెయ్యితో ఈ స్వీట్ తయారు చేస్తామంటున్నారు. ఒక కిలో ముడి పదార్ధాలతో 200 గ్రాముల ఘేవర్ స్వీట్ తయారువుతుంది చెబుతున్నారు. మొదట రాజస్థానీ స్వీట్ షాపుల్లో మాత్రమే దొరికే ఈ స్వీట్ కు డిమాండ్ పెరగడంతో ప్రస్తుతం అన్ని స్వీట్ హౌస్ ల్లో అమ్ముతుండడం విశేషం.

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×