BigTV English

Music Director Thaman: మీరు.. మీరు కొట్టుకు చావండి.. సినిమాను చంపకండి.. గేమ్ ఛేంజర్ పై థమన్ సంచలన వ్యాఖ్యలు

Music Director Thaman: మీరు.. మీరు కొట్టుకు చావండి.. సినిమాను చంపకండి.. గేమ్ ఛేంజర్ పై థమన్ సంచలన వ్యాఖ్యలు

Music Director Thaman: ఒక సినిమా హిట్ అవ్వాలన్నా.. ప్లాప్ అవ్వాలన్నా మ్యూజిక్ డైరెక్టర్ పై ఆధారపడి ఉంటుంది. హిట్ వస్తే హీరోలను.. ప్లాప్ వస్తే డైరెక్టర్స్ ను ట్రోల్ చేసే నెటిజన్స్.. మ్యూజిక్ విషయంలో మాత్రం అలాంటివి చేయరు. సినిమా హిట్ అయితే పొగుడుతారు..  ప్లాప్  అయితే ట్రోల్ చేస్తారు. ఇక ఇదంతా పక్కన పెడితే.. టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్  మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు థమన్. మొదటి నుంచి థమన్  కాపీ ట్యూన్స్ ఇస్తాడు అని  పేరు ఉంది. అయినా కూడా ఆ కాపీ ట్యూన్స్ నే ఎక్కువ వినడానికి అలవాటు పడిపోయారు ఫ్యాన్స్.


ఇక అందరి హీరోలకు ఎలా ఇస్తాడో తెలియదు కానీ, బాలకృష్ణ మూవీకి మాత్రం రఫ్ఫాడించేస్తాడు. అఖండ దగ్గరనుంచి డాకు ,మహారాజ్ వరకు థమన్ హిట్ అందుకుంటూనే ఉన్నాడు. అందుకే బాలయ్య  అధికారికంగా నందమూరి థమన్ అనేశాడు కూడా. అయితే ఈ సంక్రాంతికి థమన్ నుంచి రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి డాకు అయితే ఇంకొకటి గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ – శంకర్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకుంది. సినిమా బాగానే ఉన్నా  చాలామంది నెగిటివిటి స్ప్రెడ్ చేశారని మెగా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.

నిజం చెప్పాలంటే ఈ సినిమా వెనుక రాజకీయాలు చాల జరిగాయి. కావాలనే గేమ్ ఛేంజర్ సినిమా HD ప్రింట్ ను ఫైరసీ చేశారు. ఆ సినిమాను బస్సులోనూ, లోకల్ ఛానెల్స్ లోనూ వేశారు. ఇలా ఈ సినిమాను మొత్తం నెగిటివిటీ చేస.. ఒక సినిమాను చంపేశారు. దీనిపై నిర్మాత దిల్ రాజు ఫైర్  అయిన విషయం తెల్సిందే. తాజాగా డాకు మహారాజ్ విజయోత్సవ సభలో థమన్  ఈ ఘటన గురించి మాట్లాడాడు. సినిమా పేరు ఎత్తకుండా  మన సినిమాను మనమే చంపుకుంటున్నామని ఎమోషనల్ అయ్యాడు.


Sankranthiki Vastunam: పెద్దోడి విక్టరీ సెలబ్రేషన్స్.. చిన్నోడే హైలైట్ అమ్మా

” మనమే మన సినిమాని చంపేసుకుంటుంటే.. ఏం బతుకు బతుకుతున్నామో అర్థంకావట్లేదు.అంటే బాధగా ఉంది. ఓపెన్ గా ఒకరు ఒక సినిమా సక్సెస్ గురించి చెప్పుకోలేకపోతున్నాం. అది ఎంత దురదృష్టమో. మన సినిమా గురించి మనం చెప్పుకోవాలి కదా. సినిమా అనేది గొప్పది. వ్యక్తిగతంగా మీరు కొట్టుకు చావండి. కానీ, సినిమాను చంపకండి. అది కరెక్ట్ కాదు. చాలా పెద్ద తప్పు అది. ఏ సినిమాకు అలా జరగకూడదు అని నేను ప్రార్థిస్తున్నాను.

నేను తప్పు చేసానా.. నా సైడ్ తప్పు ఉంటే ఆరోజు రాత్రి 12 గంటలలోపు సాల్వ్ చేసుకుంటా. వాళ్ల కాళ్లు పట్టుకొని అయినా క్షమాపణ అడుగుతాను. తరువాతి రోజు ఎలాంటి శత్రువులు ఉండరు నా లైఫ్ లో. పొద్దునే లేస్తామో లేదో తెలియదు. ఈరోజు పడుకుంటాం.. రేపు లేస్తావని నువ్వు ప్రామిస్ చేయగలవా.. ? రేపు ఏం జరుగుతుందో.. ఎవరు ఉంటారో పోతారో తెలియనప్పుడు ఎందుకు ఇంత నెగిటివిటీ.  కోవిద్ లో అందరు చనిపోయారు. ఇండస్ట్రీ కూడా చచ్చిపోయింది. మళ్లీ పెద్ద పెద్ద డైరెక్టర్స్ మన తెలుగు సినిమాను ఎక్కడికో తీసుకెళ్తున్నారు.

మన సినిమాలు అన్ని దేశాల్లో రిలీజ్ అవుతున్నాయి. తెలుగువారు చాలా గొప్పవారు. ప్రపంచంలో అన్ని చోట్లకు వెళ్లారు. అక్కడ తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో, ఒక సినిమాను కాపాడడం మన అందరి బాధ్యత. సినిమా బాగోకపోతే వదిలేయండి. మేము తీసుకుంటాం. తరువాత ఇలాంటి తప్పు చేయకూడదు అని తెలుసుకుంటాం. కానీ నిర్మాతలు అలా కాదు కదా. వాళ్లు మన ఆత్మలు లాంటివారు. వారిని బాధపెట్టకూడదు. ఏ తప్పు జరిగినా అది నిర్మాతమీదనే పడుతుంది. ఇలాంటి నెగిటివిటీని ఆపేద్దాం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×