Rohit Sharma: టీమిండియా… ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మొన్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ని కోల్పోయిన టీమిండియా… అంతకు ముందు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. దీంతో వరుసగా రెండు టెస్టు సిరీస్ లు కోల్పోయిన టీమ్ ఇండియా… వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అవకాశం కూడా కోల్పోయింది. దీంతో టీం ఇండియా స్థానంలో సౌత్ ఆఫ్రికా అలాగే ఆస్ట్రేలియా జట్లు… వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు వెళ్లాయి.
Also Read: Rinku Singh Engagement: లేడీ ఎంపీతో టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ ఎంగేజ్మెంట్
అయితే ఈ నేపథ్యంలో టీమిండియా పై భారత క్రికెట్ నియంత్రణ మండలి చాలా… సీరియస్ గా వ్యవహరిస్తోంది. కొత్తగా పది రూల్స్ కూడా తీసుకువచ్చింది. అయితే ఇలాంటి నేపథ్యంలో… రేపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) అలాగే… సెలక్షన్ కమిటీ హెడ్ అజిత్ అగర్కార్ ( Ajit Agarkar ) ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. రేపు మధ్యాహ్నం ముంబైలో రోహిత్ శర్మ ప్రెస్ మీట్ ఉండబోతుందట. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారని ఈ సమాచారం అందుతోంది.
ఈ సందర్భంగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటుపై ( Champions Trophy 2025 ) కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉందట. అంతేకాదు టీమిండియా సభ్యుల లిస్టును కూడా ఈ సందర్భంగా ప్రకటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు లిస్టు కూడా ఖరారు అయిందని అంటున్నారు. రోహిత్ శర్మ ( Rohit Sharma ) ప్రెస్ మీట్ లైవ్… స్టార్ స్పోర్ట్స్ తో పాటు హాట్ స్టార్ లో రానుంది. అయితే చాంపియన్స్ ట్రోఫీకి మొన్నటి వరకు… బుమ్రా అందుబాటులో ఉండడని అంటున్నారు.
Also Read: TATA WPL 2025 Schedule: మహిళల ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ ఇదే.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?
మన ఆస్ట్రేలియా టూర్ లోనే బుమ్రా కు గాయమైన సంగతి తెలిసిందే. అయితే… ఈ గాయం కారణంగా రెండు నెలలపాటు బుమ్రాకు రెస్ట్ అవసరమని ముందుగా ప్రచారం జరిగింది. కానీ తాజా అప్డేట్ ప్రకారం… చాంపియన్స్ ట్రోఫీ 2025 ( Champions Trophy 2025 ) టోర్నమెంటుకు… ఫాస్ట్ బౌలర్ బుమ్రా ఆడబోతున్నాడని ఈ వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని రేపు ప్రెస్ మీట్ లో రోహిత్ శర్మ ( Rohit Sharma ) ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.
బూమ్రా చాంపియన్స్ ట్రోఫీలో ( Champions Trophy 2025 ) ఆడతాడని… దాంతోపాటు జట్టు సభ్యులను కూడా ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఛాంపియన్ ట్రోఫీలో కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వైస్ కెప్టెన్సీ… బుమ్రా కు ఇస్తారని అంటున్నారు. మరి రేపు మధ్యాహ్నం రోహిత్ శర్మ ఇలాంటి ప్రకటన చేస్తారో వేచి చూడాలి. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టోర్నమెంట్ అయిపోయిన తర్వాత వెంటనే ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభమై మార్చిలో ముగుస్తుంది. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్.. 2025 టోర్నమెంట్ మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభంపానున్న సంగతి తెలిసిందే.
Captain Rohit Sharma and Ajit Agarkar will address the PC tomorrow at 12.30pm.
– It’ll be live on Star Sports and Hotstar. pic.twitter.com/fKmf0cdCUH
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 17, 2025