Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రేమలో పడ్డారు. ఈ మాటలు స్వయంగా చెప్పింది కూడా ఆయనే కావడం గమనార్హం. అంత పెద్ద ఆర్థిక వేత్త, ప్రేమలో పడడం ఏమిటని అనుకుంటున్నారా.. అవును మీరు విన్నది నిజమే. ఇంతకు ఆయన ప్రేమలో ఎప్పుడు పడ్డారు? ఎవరితోనో తెలుసుకుందాం.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్తగా అందరికీ తెలుసు. దేశ ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టడంలో మన్మోహన్ సింగ్ పాత్ర మరువలేనిది. అలా మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా కూడా సుపరిపాలన అందించారు. ప్రధానమంత్రిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంలో తనదైన పాత్ర పోషించారు మన్మోహన్ సింగ్. అందుకే మన్మోహన్ సింగ్ అనగానే.. ప్రపంచ ఆర్థికవేత్తల్లో ఒకరని ఎవరైనా చెబుతారు. అంతటి గుర్తింపు పొందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు.
గురువారం తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్ సింగ్ ను కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మన్మోహన్ సింగ్ దివిశ్వాస విడిచారు. ఇక మన్మోహన్ సింగ్ జీవితంలో ప్రేమ అనే పదానికి కూడా చోటు ఉందని స్వయంగా ఆయనే చెప్పారు. ఇంతకు ఆయన ప్రేమలో పడింది ఎప్పుడో తెలుసుకుందాం.
మన్మోహన్ సింగ్ ఉపాధ్యాయులుగా కూడా పనిచేశారు. ఎందరో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పారు. అటువంటి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి హోదాలో తన ఉపాధ్యాయ వృత్తి జ్ఞాపకాలను పంచుకున్నారు. తనకు ఉపాధ్యాయ వృత్తి అంటే ఎనలేని ప్రేమ, గౌరవమని, బాల్యం నుండే తాను ఉపాధ్యాయుడిగా రాణించాలన్న కోరిక తనలో ఉండేదని మన్మోహన్ తెలిపారు. ఎందరో విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ఒక ఉపాధ్యాయ వృత్తికే వస్తుందని, అటువంటి వృత్తిలో తాను రాణించడం తనకు దక్కిన గొప్ప అవకాశం గా భావిస్తున్నానంటూ తెలిపారు.
Also Read: Manmohan Singh Death: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరు
ఉపాధ్యాయ వృత్తిని విడిచిపెట్టి వచ్చిన రోజును తాను ఎప్పటికీ మర్చిపోలేనని, తన జీవితమనే పుస్తకంలో ఉపాధ్యాయ వృత్తి అనే పేజీ నిరంతరం ఉంటుందన్నారు. ఈ మాటలను బట్టి మనం చెప్పవచ్చు. మన్మోహన్ సింగ్ ఉపాధ్యాయ వృత్తిని ఎంత గౌరవంగా నిర్వహించారోనని గ్రహించవచ్చు. అంటే మన్మోహన్ సింగ్ ప్రేమలో పడింది మాత్రం తమకిష్టమైన ఉపాధ్యాయ వృత్తితోనని మనం గ్రహించాలి.