BigTV English

Thandel OTT : ‘తండేల్’ ఓటీటీ అప్డేట్.. స్ట్రీమింగ్ అప్పుడే.. ఫిక్స్ అయిపోయిండి..

Thandel OTT : ‘తండేల్’ ఓటీటీ అప్డేట్.. స్ట్రీమింగ్ అప్పుడే.. ఫిక్స్ అయిపోయిండి..

Thandel OTT : టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ బ్లాక్ హిట్ మూవీ తండేల్.. గత కొన్నేళ్లుగా హిట్ సినిమాలేదని ఫీల్ అవుతున్న నాగ చైతన్యకు ఈ మూవీ రిజల్ట్ ఫుల్ ఖుషి అయ్యేలా చేసింది. రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. దాంతో మూవీ సూపర్ హిట్ అయ్యింది. సాయి పల్లవి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయ్యింది. అదే మూవీకి మ్యాజిక్ అనే చెప్పాలి. ఎవ్వరు ఊహించని రీతిలో కలెక్షన్స్ ను వసూల్ చేసింది. తండేల్ మూవీ చాలా తక్కువ టైమ్ లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరి అందర్నీ ఆశ్చర్యపరిచింది. గత వారం రిలీజైన సినిమాలు కూడా ఏవీ మంచి టాక్ తెచ్చుకోకపోవడంతో తండేల్ ఇప్పటికీ మంచి ఆక్యుపెన్సీలతో థియేటర్లలో రన్ అవుతుంది.. ఈ జోరు చూస్తుంటే మూవీ ఇంకొన్ని రోజులు రన్ అవుతుందని తెలుస్తుంది.. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ అప్డేట్  వచ్చేసింది. మరి ఈ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


ఈ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజులకే ఓటీటీలోకి రానున్నట్టు వార్తలొస్తున్నాయి. కానీ మేకర్స్ నుంచి ఎక్కడ క్లారిటీ రాలేదు. ఫిబ్రవరి 7న తండేల్ థియేటర్లలోకి వచ్చింది. దీన్ని బట్టి మార్చి 7న తండేల్ ఓటీటీలోకి రానుందని అంటున్నారు. తండేల్ ఓటీటీ రిలీజ్ పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వచ్చింది లేదు. దాంతో ఓటీటీలోకి ఆలస్యంగా వస్తుందేమో అని ఓ వార్త అయితే ప్రచారంలో ఉంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. చిత్ర ప్రమోషన్స్ టైమ్ లో స్వయంగా డైరెక్టర్ చందూనే ఈ విషయాన్ని చెప్తూ, ఓటీటీ డీల్ తోనే ఈ సినిమా బడ్జెట్ లో సగానికి పైగా రికవరీ అయిందని వెల్లడించాడు.. సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన మొదటి రోజే మూవీ పైరసీ అయ్యింది. అయితే ఇప్పుడు ఓటీటీ లో రిలీజ్ డేట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు..

Also Read :ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డ సమంత.. అస్సలు ఊహించలేదు మామా..!


సినీ ఇండస్ట్రీకి ఫిబ్రవరి అనేది డ్రై సీజన్. అన్ సీజన్ లో రిలీజైనా, మూవీ రిలీజైన మొదటి రోజే పైరసీ ద్వారా హెచ్‌డీ వెర్షన్ వచ్చినా అవేవీ తండేల్ సక్సెస్ పై ప్రభావం చూపలేకపోయాయి. ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వడం తో పాటుగా భారీగా కలెక్షన్స్ ను అందుకుంది. మొత్తానికి మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.. సినిమా టాక్ మాత్రమే కాదు. అటు కలెక్షన్స్ కూడా దుమ్ము దులిపేస్తుంది. ఈ సినిమా ఓ అరుదైన మైలురాయిని చేరుకుంది. తండేల్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ రాబట్టి అబ్బురపరచింది. పది రోజుల్లో 120 కోట్లు వసూల్ చేసి ప్రేక్షకుల మనసు దోచుకుంది.. ఈ మూవీలో చైతన్య మత్స్యకారుడి పాత్రలో నటించి అదరగొట్టేశాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందింది.

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×