BigTV English

Congress: ఆప్‌ను గెలిపించడం మా బాధ్యత కాదు: కాంగ్రెస్

Congress: ఆప్‌ను గెలిపించడం మా బాధ్యత కాదు: కాంగ్రెస్

Congress: ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ సరళిపై కాంగ్రెస్ స్పందించింది. ఆప్‌ను గెలిపించడం మా బాధ్యత కాదు. మా అభ్యర్ధులను గెలిపించుకునేందుకు చాలా ప్రయత్నించాం. ఢిల్లీ ఓటర్లు తీర్పును గౌరవిస్తాం అని ట్వీట్ చేసింది. ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరవని సంగతి తెలిసిందే.


ఇదిలా ఉంటే.. ఢిల్లీ ఎన్నికల రిజల్ట్‌పై పలువురు స్పందించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. చాలా చోట్ల కాంగ్రెస్, ఆప్ మధ్య ఓట్లు చీలి.. బీజేపీకి బెనిఫిట్ అయింది. మెజార్టీ సెగ్మెంట్లలో ఆప్, కాంగ్రెస్ ఓట్లు లెక్కేస్తే బీజేపీ కంటే ఎక్కువున్నాయి. ఇప్పటికే చాలా మంది ఇండియా కూటమి నేతలు ఇదే విషయంపై రియాక్ట్ అవుతున్నారు. ఎన్నికలకు ముందే పొత్తులు పెట్టుకుని బరిలో దిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని గుర్తు చేస్తున్నారు. అటు జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఇదే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు.

మనం మనం తగువులాడుకుంటే ఇలాగే ఉంటుందని ట్వీట్ పెట్టారు. ఇంకా ఇలాగే కొట్టుకుందాం అని క్యాప్షన్ పెట్టారు. బీజేపీ ఆధిక్యంలో ఉన్న 40 సీట్లకు గానూ 10 సీట్లలో మార్జిన్ వెయ్యి లోపే ఉంది. అలాగే మరో 23 సీట్లలో 2 వేల లోపే ఆధిక్యం ఉంది. అంటే ఈ లెక్కలు చూస్తే ఆప్, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఉంటే కథ మొత్తం మారిపోయి ఉండేది. మ్యాజక్ మార్క్ ను ఆప్, కాంగ్రెస్ కలిసి ఈజీగా సాధించేవన్న విశ్లేషణను వినిపిస్తున్నారు.


అటు శివసేన ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ కూడా ఆప్, కాంగ్రెస్ పొత్తు విషయంలో కీలక కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమిగా పని చేసి అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి విడివిడిగా పోటీ చేయడం నష్టం చేసిందన్నారు. కలిసి పోటీ చేస్తే బీజేపీని అధికారంలోకి దూరంగా ఉంచే వారన్నారు. అలా జరగకపోవడంతో బీజేపీ పని సులువైందని కామెంట్స్ చేశారు సంజయ్ రౌత్.

Also Read: ఢిల్లీ గడ్డపై కమల వికాసం.. ఆప్ పని ఖతమేనా!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వెనుకంజపై సోషల్ యాక్టివిస్ట్ అన్నా హజారే రియాక్ట్ అయ్యారు. ప్రవర్తన, ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలని, రాజకీయ జీవితం నింద లేకుండా ఉంటే ఓటర్లలో నమ్మకం పెంచుతాయని తాను ఎప్పుడూ చెబుతూనే ఉన్నానన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌కి ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా అతను పట్టించుకోలేదన్నారు. చివరికి కేజ్రీవాల్ లిక్కర్ పై ఫోకస్ పెట్టి.. మనీ పవర్ ముందు లొంగిపోయాడని విమర్శించారు.

మరోవైపు డిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని చీపిరితో ఊడ్చేశారన్నారు BJP నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్. డిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు ఆయన. డిల్లీ ప్రజలు ప్రజాస్వామ్య బద్ధమైన పాలనను కోరుకున్నారని పేర్కొన్నారు. అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు మాకు వద్దు అనుకున్నారని విమర్శించారు. మేధావి వర్గం అంతా BJPకి ఓటు వేశారని.. తెలంగాణలో సైతం అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×