Thandel:అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya ) మరో ఆరు రోజుల్లో తండేల్ (Thandel) మూవీతో మన ముందుకు రాబోతున్నారు. నాగచైతన్య నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. అందుకే అటు అక్కినేని అభిమానులతో పాటు ఇటు కుటుంబ సభ్యులు కూడా నాగచైతన్యపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 7న విడుదల కాబోయే తండేల్ (Thandel) సినిమా కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి నాగచైతన్య.. అభిమానులతో పాటు అక్కినేని ఫ్యామిలీని మెప్పించగలడా..? తండేల్ తో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడు? అనేది ఇప్పుడు చూద్దాం..
ధూత తో భారీ గుర్తింపు..
అక్కినేని నాగచైతన్య చివరిగా 2023లో ధూత(Dhootha) అనే వెబ్ సిరీస్ తో అభిమానులను పలకరించారు. ఇక ధూత వెబ్ సిరీస్ బాగుండడంతో దీనికి సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు. అయితే ఓటీటీ లో ఫ్యాన్స్ ని పలకరించినప్పటికీ రెండు సంవత్సరాల నుండి థియేటర్లో ఫ్యాన్స్ కి దూరమయ్యారు నాగచైతన్య. ఇక తండేల్ అనే భారీ ప్రాజెక్టుతో ఇన్ని రోజుల తర్వాత నాగచైతన్య(Naga Chaitanya ) అభిమానులని పలకరించబోతున్నాడు.
అక్కినేని ఆశలన్నీ చైతూ పైనే..
ఈ సినిమా ఎలా ఉంటుందోనని అందరిలో ఒక ఆత్రుత అయితే ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు,పోస్టర్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సినిమాకు మంచి ప్లస్ అయ్యాయి. ఈ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి (Naga Chaitanya, Sai Pallavi) యాక్టింగ్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో వీరు యాక్టింగ్ ఎంత బాగా చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇక నటి సాయి పల్లవి గురించి చెప్పుకోనక్కర్లేదు. ఆమె ఏ పాత్ర ఇచ్చినా సరే అందులో ఒదిగిపోతుంది.అలా నాగచైతన్య, సాయి పల్లవి కాంబోలో చందు మొండేటి(Chandu Mondeti) దర్శకత్వం వహిస్తున్న తండేల్ మూవీకి వరుస ప్రమోషన్స్ చేస్తూ.. సినిమాపై హైప్ పెంచుతున్నారు. అయితే అక్కినేని ఫ్యామిలీలో ఇప్పటివరకు రూ.100 కోట్ల క్లబ్లో చేరిన హీరో ఎవరు లేరు. ఇక ఏఎన్ఆర్(ANR) విషయం పక్కన పెడితే.. నాగార్జున (Nagarjuna) గానీ,అఖిల్ (Akhil)గానీ,నాగచైతన్య(Naga Chaitanya) గానీ ఒక్కరు కూడా రూ.100 కోట్ల క్లబ్లో చేరలేదు. అటు నాగార్జున తరం హీరోలందరూ రూ.100 కోట్ల క్లబ్ లో చేరి హిట్స్ కొడుతుంటే, ఇటు నాగార్జున (Nagarjuna)కు మాత్రం అంతగా కలిసి రావడం లేదు. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ ఆశలన్నీ కూడా నాగచైతన్య పైనే ఉన్నాయి.
చైతూ ఆ రికార్డు బ్రేక్ చేస్తారా..?
ఈ సినిమాతో నాగచైతన్య రూ.100 క్లోట్ల క్లబ్లో చేరితే మాత్రం అక్కినేని ఫ్యామిలీలో మొదటి రికార్డు చైతూకి దక్కుతుంది. అలాగే ఈయన కంటే వెనక వచ్చి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని యంగ్ హీరోలు కూడా రూ.100 కోట్ల క్లబ్ లో చేరుతున్నారు. కానీ అక్కినేని ఫ్యామిలీ మాత్రం రూ.100 కోట్ల క్లబ్లో చేరే సినిమాలు తీయకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. కానీ చందు మొండేటి తీసిన కార్తికేయ-2 (Karthikeya-2) భారీ హిట్ కొట్టడంతో ఈయన డైరెక్షన్లో రాబోతున్న తండేల్ మూవీ పై కూడా అభిమానులకు ఆశలు ఉన్నాయి. మరి అక్కినేని ఫ్యామిలీతో పాటు అభిమానుల ఆశలను నాగచైతన్య నెరవేరుస్తాడా..? రూ.100 కోట్ల క్లబ్లో చేరి అక్కినేని ఫ్యామిలీలో సెన్సేషన్ సృష్టించిన హీరోగా పేరు తెచ్చుకుంటాడా? అనేది పూర్తిగా తండేల్ మూవీ పైనే ఉంది. మరి చూడాలి తండేల్ మూవీ (Tandel Movie)అక్కినేని ఫ్యాన్స్ తో పాటు కుటుంబ సభ్యులను ఏ మేర మెప్పిస్తుందో చూడాలి.