Jos Buttler: టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో t20 మ్యాచ్ వివాదంగా మారింది. ఈ మ్యాచ్ లో కంకషన్ సబ్‌స్టిట్యూట్ రూల్ ( Concussion Substitute) కారణంగా టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఈ నాల్గవ టి20 మ్యాచ్ లో భాగంగా… కంకషన్ సబ్‌స్టిట్యూట్ ( Concussion Substitute) రూల్ వినియోగించింది టీమిండియా. దీంతో శివం దూబే స్థానంలో బౌలర్ హర్షిత్ రాణా… జట్టులోకి వచ్చి… ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. హర్షిత్ రాణా బౌలింగ్ దెబ్బకు ఇంగ్లాండ్ ఓడిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే అతని బౌలింగ్ లో కీలక బ్యాటర్లందరూ అవుట్ అయ్యారు.
Also Read: Ind vs Eng, 4th T20I: సిరీస్ గెలిచిన టీమిండియా… హర్షిత్ బౌలింగ్ పై గంభీర్ రియాక్షన్ అదుర్స్!
మొత్తం ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు తీశాడు హర్షిత్ రాణా. అటు శివం దుబే కూడా 53 పరుగులతో దుమ్ము లేపాడు. మొదట బ్యాటింగ్ చేసిన సమయంలో శివం దూబేను వాడుకుంది టీం ఇండియా. అతడు 53 పరుగులు చేయగా…కంకషన్ సబ్‌స్టిట్యూట్ ( Concussion Substitute) రూల్ తో జట్టులోకి హర్షిత్ రాణా చివర్ లో వచ్చాడు. దీంతో అతడు మూడు వికెట్లు తీయడంతో టీమిండియా విజయం సాధించింది. అయితే హర్షిత్ రాణాను కంకషన్ సబ్‌స్టిట్యూట్ ( Concussion Substitute) ద్వారా వాడుకోవడం పట్ల ఇంగ్లాండ్ జట్టు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ముందుగా హర్షిత్ రాణాను తీసుకుంటామంటే… ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ( Jos Buttler) ఒప్పుకున్నాడు.
అయితే తీరా మ్యాచ్ ఓడిపోయిన తర్వాత… తీవ్ర అన్యాయం అంటూ రెచ్చిపోయాడు బట్లర్. శివం దుబ్బే స్థానంలో హర్షిత్ రాణాను కంకషన్ సబ్‌స్టిట్యూట్ ( Concussion Substitute) ద్వారా తీసుకోవడం తీవ్ర అన్యాయం అని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ( Jos Buttler ) సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని తాము అంగీకరించడం లేదని మీడియా ముందు తెలిపారు జోస్ బట్లర్ ( Jos Buttler). తన దృష్టిలో ఇది లైక్ టు లైక్ రిప్లేస్మెంట్ కాదంటూ బాంబు పేల్చారు. దీనిపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని కూడా ఇంగ్లాండ్ ప్లేయర్లు అంటున్నారు. అయితే ఈ అంశంపై టీమిండియా నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఎవరు కూడా స్పందించలేదు. కాగా ఈ మ్యాచ్ లో టీమిండియా 15 పరుగుల తేడాతో విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే.
Also Read: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే పాకిస్థాన్ టీం ఇదే.. కెప్టెన్ ఎవరంటే ?
ICC ప్లే కండిషన్స్ నియమం ప్రకారం… కంకషన్ సబ్‌స్టిట్యూషన్ అంటే ఒక ప్లేయర్ గాయపడితే.. మరో ప్లేయర్ ను ఆడించడమే. మ్యాచ్ జరుగుతున్న సమయంలో.. ప్లేయింగ్ ఎలెవన్ లో ఉన్న ఆటగాడు ఏ రకమైన గాయానికి గురైతే.. కంకషన్ సబ్‌స్టిట్యూషన్ రూల్ వాడుకోవచ్చు. అప్పుడు అంపైర్లకు సమాచారం ఇవ్వాలి. అయితే.. గాయమైన ప్లేయర్ స్థానంలో.. సాదా సీదా ప్లేయర్ ను మాత్రమే తీసుకోవాలి. గాయపడిన ప్లేయర్ కంటే.. ఎక్కువగా ఆడే ప్లేయర్ ను తీసుకోవద్దు. ఈ విషయాలను అంపైర్ పరిశీలించి తీసుకుంటాడు. ఇక గ్రౌండ్ లోకి దిగిన కంకషన్ సబ్‌స్టిట్యూషన్ ప్లేయర్ బౌలింగ్ లేదా బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంటుందని రూల్స్ చెబుతున్నాయి. అయితే.. దూబే, హర్శిత్ రాణా విషయంలో కూడా ఇదే జరిగింది.
For batting all-rounder concussion substitute player as Pure Bowler is a CRIME. pic.twitter.com/xunNAzULqb
— GoMuki (@GoMuki10) January 31, 2025
🚨Jos Buttler on Concussion Substitute:
"Its not a like to like replacement, either Dube put on 25 mile an hour with the ball or Harshit really improved his batting."
JOS BUTTLER DESTROYED MATCH REFEREE JAVAGAL SRINATH & GAMBHIR IN 1 SENTENCE!!pic.twitter.com/lJ6tU66WTr
— Rajiv (@Rajiv1841) January 31, 2025