Hardik – Kohli: జనవరి 31 వ తేదీన భారత్ – ఇంగ్లాండ్ మధ్య పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన నాలుగ టీ-20 లో చివరివరకు పోరాడి భారత్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ కి దిగి.. ఆరంభంలోనే కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ రెండవ ఓవర్ లోనే మూడు వికెట్లను కోల్పోయింది భారత్.
Also Read: Jos Buttler: టీమిండియా తొండాట…”కంకషన్ సబ్‌స్టిట్యూట్” పై ICCకి ఫిర్యాదు..అసలు ఈ రూల్ ఏంటీ !
కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్, తిలక్ వర్మ.. ముగ్గురు వెనువెంటనే పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన రింకు సింగ్ 30 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అనంతరం హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే భారత బ్యాటింగ్ కి భరోసా ఇచ్చారు. భారీ సిక్సర్లు, ఫోర్లతో సునామీ సృష్టించారు. అయితే హార్దిక్ పాండ్యా {Hardik Pandya} ఎప్పటిలాగే ఒత్తిడిలో ప్రశాంతంగా కనిపించి.. ఇంగ్లాండ్ బౌలర్లపై దండయాత్ర చేశాడు. ఎవరిని వదిలిపెట్టకుండా బాధి పారేశాడు.
నాలుగు ఫోర్లు, నాలుగు సిక్స్ లతో.. 30 బంతులలో 53 పరుగులు చేశాడు. పాండ్యా {Hardik Pandya} పవర్ హిట్టింగ్ తో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 181 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో మాజీ వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్ లో మెరుపు హాఫ్ సెంచరీ తో డెత్ ఓవర్లలో {16 to 20} అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు.
పాండ్యా ఈ రికార్డును సాధించే క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ని {Hardik Pandya} అధిగమించాడు. విరాట్ కోహ్లీ డెత్ ఓవర్లలో 192.54 స్ట్రైక్ రేట్ తో 1032 పరుగులు చేయగా.. మహేంద్ర సింగ్ ధోని 152.02 స్ట్రైక్ రేట్ తో 1014 పరుగులు చేశాడు. ఇక హార్దిక్ పాండ్యా 174.24 స్ట్రైక్ రేట్ తో 1068 పరుగులు చేశాడు. అంతేకాదు.. 5, 6, 7 స్థానాలలో టి-20 ల్లో బ్యాటింగ్ కి దిగి అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేసిన భారత బ్యాటర్ గా రికార్డ్ సృష్టించాడు.
Also Read: Ind vs Eng, 4th T20I: సిరీస్ గెలిచిన టీమిండియా… హర్షిత్ బౌలింగ్ పై గంభీర్ రియాక్షన్ అదుర్స్!
ఈ మ్యాచ్ లో హార్దిక్ కేవలం 27 బంతులలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్న సమయంలో 18 ఓవర్ మొదటి బంతికి జామీ ఓవర్టన్ వేసిన బంతిని ఫ్రంట్ లెగ్ ని క్లియర్ చేసి.. బంతిని చూడకుండా లాంగ్ ఆన్ పై సిక్సర్ బాదాడు. దీంతో {Hardik Pandya} హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఈ క్రమంలో డగౌట్ లో ఉన్న అతడి సహచరులు, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో పాటు స్టేడియంలోని ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకున్నాడు.
🚨 HARDIK PANDYA CREATED HISTORY 🚨
– Hardik Pandya now has the Most runs in death overs (16-20th) for India in T20I History…!!!! 🤯 pic.twitter.com/flcQwwwBAe
— Tanuj Singh (@ImTanujSingh) January 31, 2025