Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘తండేల్’ (Thandel). చందూ మొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ఇప్పటికే చిత్ర బృందం మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. తాజాగా నాగ చైతన్య ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు అంటూ సెట్లో ఆయన చేపల పులుసు పండిన వీడియోను రిలీజ్ చేశారు.
చేపల పులుసు వండిన నాగచైతన్య…
నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘తండేల్’ (Thandel). గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 7న భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోని చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను షురూ చేసింది. ఇప్పటికే ఈ సినిమాలోని ‘బుజ్జి తల్లి’, ‘నమో నమః శివాయ’ పాటలను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ రెండు పాటలకు కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ముఖ్యంగా ‘బుజ్జి తల్లి’ సాంగ్ యూత్ హాట్ ఫేవరెట్ గా మారింది.
తాజాగా ఈ సినిమాలో తండేల్ రాజు అనే పాత్రలో నటిస్తున్న నాగచైతన్య విశాఖపట్నంలోని స్థానిక మత్స్యకారులతో కాస్త టైం స్పెండ్ చేశారు. “షూటింగ్ ఆఖరి రోజున ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు” అంటూ స్వయంగా నాగచైతన్య చేపల పులుసు వండిన వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. అందులో నాగచైతన్య అక్కడి స్థానికులతో పాటు చిత్ర బృందానికి రుచికరమైన చేపల పులుసును వండి రుచి చూపించాడు.
తిన్నవారి రియాక్షన్ ఏంటంటే…
“యాటలో చేపలు పట్టేశాక మంచి పులుసు ఎట్టేయాలి కదా… తండేల్ రాజా అకా యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య షూటింగ్ లో స్థానికుల కోసం నోరూరించే చేపల పులుసు వండి పెట్టారు” అంటూ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక చైతన్య చేసిన చేపల పులుసు రుచి చూసిన స్థానికులు టేస్టీగా ఉందంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా ‘తండేల్’ మూవీ సక్సెస్ కావాలని హృదయపూర్వకంగా కోరుకున్నారు.
కాగా ‘తండేల్’ (Thandel) మూవీ శ్రీకాకుళానికి చెందిన మత్స్యకారుల జీవిత కథతో రూపొందుతున్న సంగతి తెలిసిందే. సముద్రంలో చేపల వేటకు వెళ్లి, పొరపాటున పాకిస్థాన్ జలాల్లోకి చేరుకున్న తండేల్ రాజా టీంను అక్కడి అధికారులు పట్టుకోవడం, ఆ తర్వాత అక్కడ నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు? అనే స్టోరీతో ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక తాజాగా రిలీజ్ చేసిన ఈ వీడియోలో తండేల్ రాజా పాత్ర కోసం నాగచైతన్య ఎంతగా కష్టపడుతున్నాడో కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన శ్రీకాకుళం యాసలో మాట్లాడడం కూడా నేర్చుకున్న సంగతి తెలిసిందే.
యేటలో చేపలు పట్టేసాక..మంచి పులుసు ఎట్టేయాలి కదా ♨️
'Thandel Raju' aka Yuvasamrat @chay_akkineni cooks a lip-smacking 'Chepala Pulusu' for the locals during the shoot of #Thandel 😋
▶️ https://t.co/jjjNF96j8e#Thandel GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 7th 💥#ThandelonFeb7th… pic.twitter.com/79TqVc5uL8
— Geetha Arts (@GeethaArts) January 17, 2025