BigTV English

Thandel : తండేల్ సక్సెస్ మీట్‌కి ముహూర్తం ఖరారు.. చీఫ్ గెస్ట్ ఎవరంటే ?

Thandel : తండేల్ సక్సెస్ మీట్‌కి ముహూర్తం ఖరారు.. చీఫ్ గెస్ట్ ఎవరంటే ?

Thandel :తండేల్ (Thandel).. ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు దక్కించుకున్న చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఇది. గత కొంతకాలంగా సరైన కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని హీరో నాగచైతన్య(Naga Chaitanya) ఇందులో హీరోగా నటించారు. ఇక ఈయనకు జోడిగా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) మళ్లీ జతకట్టింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘లవ్ స్టోరీ’ సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మళ్లీ ఇదే కాంబో అని చెప్పడంతో.. మొదటి నుంచే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందులో భాగంగానే సినిమా నుండి విడుదలైన పాటలు, పోస్టర్స్, ట్రైలర్ అన్నీ కూడా సరికొత్త సంచలనం సృష్టించాయి. ఇక సినిమా కూడా శ్రీకాకుళం మత్స్యకారుల నిజజీవితంలో జరిగిన ఒక సంఘటనను ఆధారంగా తీసుకొని తెరకెక్కించారు.


మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా.. కలెక్షన్లతో జోరు పెంచిన తండేల్..

దీంతో సినిమా సూపర్ హిట్ అవుతుందని, బ్లాక్ బస్టర్ అని అందరూ అనుకున్నారు. కానీ సినిమా విడుదలైన తర్వాత మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా మొదటి భాగంలో ల్యాగ్ ఎక్కువగా ఉందని పబ్లిక్ నుంచి వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది తండేల్ సినిమా. అందులో భాగంగానే మూడవ రోజుకు సంబంధించిన కలెక్షన్ల పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం . మూడు రోజుల్లో రూ.62.37 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు పోస్టర్ రిలీజ్ చేసింది. ఇకపోతే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు తాజాగా చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించనున్నట్లు సమాచారం.


తండేల్ సక్సెస్ మీట్.. చీఫ్ గెస్ట్ గా నాగార్జున..

పబ్లిక్ లో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటే.. చిత్ర బృందం మాత్రం సూపర్ సక్సెస్ అయ్యింది అని రేపు గ్రాండ్గా సక్సెస్ మీట్ నిర్వహించనున్నారు. అంతేకాదు ఈ సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా అక్కినేని హీరో నాగార్జున (Nagarjuna) రాబోతున్నట్లు సమాచారం. మరి సూపర్ సక్సెస్ అంటూ సక్సెస్ మీట్ ని నిర్వహించబోతున్నారు. మరి ఈ మీటింగ్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

తండేల్ బిజినెస్, కలెక్షన్ లెక్కలు..

ఈ సినిమా బిజినెస్ లెక్కలు విషయానికి వస్తే.. ఏపీ, నైజాంలో గీత ఆర్ట్స్ స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసింది. కర్ణాటక, హిందీ, ఓవర్సీస్ ఇతర ప్రాంతాలలో థియేట్రికల్ రైట్స్ బాగా అమ్ముడుపోయాయి. ఆంధ్ర రూ.16 కోట్లు, నైజాం రూ.11 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో రూ.27 కోట్ల మేరా బిజినెస్ జరిగింది. సుమారుగా రూ.60 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టాల్సి ఉంటుంది.ఇకపోతే ఈ సినిమా మొదటి రోజు 21.27 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక రెండవ రోజు కూడా రూ.20 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సమాచారం. అలా ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.41.20 కోట్లు వసూలు సాధించినట్లు మేకర్స్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు మూడో రోజుల్లోనే రూ.62.37 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని, పోస్టర్ రివీల్ చేశారు. ఏది ఏమైనా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతూ కమర్షియల్ హిట్ సాధించే దిశగా అడుగులు వేస్తోందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×