Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రన్ మిషన్ గత దశాబ్దన్నర కాలం నుంచి క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్నాడు. హేమా హేమీలకు సైతం సాధ్యం కానీ గొప్ప గొప్ప రికార్డులను నెలకొల్పాడు. ఇదే సమయంలో క్రీడా ప్రపంచంలో అత్యంత ప్రజాధారణ కలిగిన క్రీడాకారుడిగాను నిలిచాడు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీకి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అభిమానులు ఉంటారన్న సంగతి తెలిసిందే.
Also Read: SA20 2025: కావ్య పాప టార్చర్.. పెళ్లి క్యాన్సల్ చేసుకున్న సన్‌రైజర్స్ ప్లేయర్ ?
ఇక తన అభిమానులను కలిసినప్పుడు విరాట్ కోహ్లీ వారితో ఎంతో ఆప్యాయంగా ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలను కలిసినప్పుడు తాను కూడా ఓ చిన్న పిల్లాడిలా మారిపోతాడు. తాజాగా ఇలాంటి ఘటనే భారత్ – ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో భాగంగా రెండో వన్డేలో చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సమయంలో విరాట్ కోహ్లీ ఇద్దరు పిల్లలతో కరచాలనం చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఒక పిల్లవాడి స్పందన అందరినీ ఆకట్టుకుంది. ఇద్దరు బాల్ బాయ్ లకు షేక్ హ్యాండ్ చేస్తూ వారిని ఆనందపరిచాడు విరాట్ కోహ్లీ.
అతడు బౌండరీ లైన్ వద్ద ఫిల్డింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ బౌండరీ లైన్ వద్ద ఇద్దరు బాల్ బాయ్స్ విరాట్ కోహ్లీతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీంతో విరాట్ కూడా వారి దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించాడు. దీంతో ఆ పిల్లల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే ఓ పిల్లాడు జీవితంలో ఓ గొప్ప విజయాన్ని సాధించినట్లుగా గుండెలపై చేయి వేసుకొని ప్రతిస్పందించాడు.
దీంతో ఆ షేక్ హ్యాండ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులు ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు. ఇక ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ.. జో రూట్, అట్కిన్ సన్ ల క్యాచ్ లను పట్టుకోవడం గమనార్హం. కానీ కోహ్లీ మరోసారి బ్యాటింగ్ లో నిరాశపరిచాడు. 8 బంతులలో 62.52 స్ట్రైక్ రేట్ తో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇక ఈ మ్యాచ్ లో భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది.
దీంతో మూడు వన్డేల సిరీస్ ని 2 – 0 తో మరో మ్యాచ్ మిగిలే ఉండగానే సిరీస్ ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ {69} అత్యధిక పరుగులు చేశాడు.
Also Read: ILT20: టోర్నీ విజేతగా దుబాయి క్యాపిటల్స్
ఇక భారత్ తరపున రవీంద్ర జడేగా అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 44.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేదించింది. ఈ రెండవ వన్డేలో తిరిగి ఫామ్ లోకి వచ్చిన రోహిత్ శర్మ తన అద్భుతమైన ఇన్నింగ్స్ తో సెంచరీ {119} చేసి భారత జట్టును గెలుపు దిశగా పరుగులు పెట్టించాడు.
This was the cutest moment of the day when Virat Kohli handshake the ball boy. ❤️#INDvsENGODIpic.twitter.com/tRUWEW0GAv
— Akshat Om (@AkshatOM10) February 9, 2025